న్యూఢిల్లీ: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. జులై 15 నుంచి 27వ తేదీకి మధ్య ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో ఆ వివరాలు వెల్లజయ్యాయి.

ఆ సర్వే ప్రకారం.... అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యానాథ్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కు రెండో స్థానం దక్కింది.

19 రాష్ట్రాల్లోని 97 లోకసభ నియోజకవర్గాల్లో ఆ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 తేదీ మధ్య 12,021 మందిని టెలిఫోన్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూల ద్వారా అభిప్రాయాలను సేకరించి, విశ్లేషించారు.