ప్రాంక్ షో పేరుతో అశ్లీల ప్రశ్నలడిగిన ఓ యూ ట్యూబ్‌ చానల్‌ అడ్డంగా బుక్కైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు చానల్ నిర్వాహకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం చెన్నై, బీసెంట్ నగర్ లో ఈ ఘటన జరిగింది. 

వివరాల్లోకి వెడితే చెన్నై టాక్స్‌ పేరిట పుట్టుకొచ్చిన ఓ యూ ట్యూబ్‌ చానల్‌ ఫ్రాంక్‌ పేరిట ఓ షో నిర్వహించింది. ఈ షోలో భాగంగా ముందుగా తాము ఎంపిక చేసుకున్న ఓ యువతి ద్వారా అశ్లీల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. 

అలాగే అదే ప్రశ్నల్ని మరికొందరి వేరే యువతులను అడుగుతూ సమాధానాలు రాబట్టే యత్నం చేశారు. ఇది కాస్తా బెడిసి కొట్టి అడ్డంగా బుక్కయ్యారు. వీరు అడిగిన ప్రశ్నలు చాలా అశ్లీలంగా ఉండడంతో ఈ తిప్పలు తప్పలేదు.

బీసెంట్‌నగర్‌లో చిత్రీకరణ సాగుతున్న సమయంలో వీరి ప్రశ్నలు విన్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. 

ఆ యూ ట్యూబ్‌ చానల్‌ అంతా అశ్లీలంతో కూడిన ప్రశ్నలు, సమాధానాలు, షోలు ఉండడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. ఆ చానల్‌ నిర్వహిస్తున్న దినేష్‌ను, చేతిలో గన్ మైక్, కెమెరాతో నగరంలో చక్కర్లు కొడుతున్న యాంకర్‌ అజీం బాచ్చా, కెమెరామన్‌ అజయ్‌బాబులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ చానల్‌ను నిషేధించాలని యూ ట్యూబ్‌కు సిఫారసు చేశారు.