Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్ లో ఫేమస్ అవ్వాలని.. బతికున్న చేపని మింగి...

టిక్ టాక్ లో క్రేజ్ సంపాదించుకోవాలని బతికున్న చేపను మింగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ప్రయత్నం బెడిసి కొట్టి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

Youth try to eat Live fish for tik tok and dies
Author
Hyderabad, First Published Jun 12, 2020, 7:48 AM IST

టిక్ టాక్.. ఈ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  సినిమాల్లో పాటలు, డైలాగ్ లకు లింప్ సింక్ ఇస్తూ, డ్యాన్సులు వేస్తూ యూత్ ఈ యాప్ ని విపరీతంగా వాడేస్తున్నారు. ఈ యాప్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సెలబ్రెటీ హోదా తెచ్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.

అయితే.. ఈ యాప్ మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా.. ఈ జాబితాలో మరో యువకుడు చేరాడు. 

టిక్ టాక్ లో క్రేజ్ సంపాదించుకోవాలని బతికున్న చేపను మింగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ప్రయత్నం బెడిసి కొట్టి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హోసూరులో చోటు చేసుకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హోసూరులోని కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన శరవణన్‌ కొడుకు వెట్రివేల్‌(22) డిగ్రీ విద్యార్థి. టిక్‌టాక్‌లో ప్రదర్శన కోసం ప్రాణంతో ఉన్న చేపను మింగాడు. అది గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక గిలగిల్లాడుతున్న వెట్రివేల్‌ను హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios