పంజాబ్‌లో మరో దారుణం జరిగింది. మోగా జిల్లాలోని ఓ మార్కెట్ సమీపంలో ఓ గ్యాంగ్ మరో ఓ యువకుడిపై  తల్వార్‌లతో దాడికి దిగింది. యువకుడు మరణించే వరకు దాడి చేసే ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

చండీగడ్: పంజాబ్‌లో మరోసారి దారుణం జరిగింది. ఓ యువకుడిని కత్తులతో వేటాడి మరి నరికి చంపారు. అదీ రద్దీగా ఉండే మార్కెట్ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ గ్యాంగ్ హతమార్చింది. నేలపై పడి నిశ్చలంగా మారే వరకు ఆ యువకుడిపై ఆ ముఠా తల్వార్లతో దాడి చేసి తర్వాత అక్కడి నుంచి పరారైంది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

మోగా జిల్లాలో బాద్ని కాలాన్ ఏరియాలో కూలీ దేశరాజ్‌ను ఆరుగురు దుండగులు తల్వార్లు పట్టుకుని వేటాడారు. దేశరాజ్ తన దగ్గర ఉన్న కత్తితో వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ, వారు ఆరుగురు ఉండటంతో ఆయన వెనుకకు అడుగులు వేస్తూనే ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వెనక్కి నడుస్తూ నేలపై కూలిపోయాడు. లేచి మళ్లీ పరుగెత్తే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే సమయం మించిపోయింది. మరోసారి నేలపై పడిపోయిన దేశరాజ్‌ను ఆ ముఠా అంతా కలిసి కత్తులతో దారుణంగా దాడి చేశారు.

మెడ, ముఖం, కాళ్లు, ఇతర భాగాల్లో తల్వార్లతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తల్వార్ల దాడికి దేశరాజ్ నేలపై నిశ్చలంగా పడిపోయాడు. స్పాట్‌లోనే మరణించాడు. రోడ్డుపై దేశరాజ్‌ను పరుగెత్తిస్తూ ఆ ముఠా వేటాడుతుండగా బాటసారులు చూస్తూ నిలబడిపోయారు. కానీ, అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నిజానికి వారు కూడా ఆ తల్వార్లతో భయపడి ఉంటారు. కానీ, చివరి క్షణంలో ఓ ముసలావిడి ఆ దుండగులను బెదిరించే ప్రయత్నం చేసింది. ఆ వృద్ధురాలి ఓ ముఠా సభ్యుడిని అడ్డుకున్న తర్వాత వారంతా అక్కడి నుంచి పరారయ్యారు.

దేశరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల ముందు దేశరాజ్‌కు ఆ దుండగులకు మధ్య చిన్న విషయమై వాగ్వాదం జరిగిందని వివరించారు. అందుకు ప్రతీకారంగానే వారు దేశరాజ్‌పై దాడి చేసి ఉంటారని తెలిపారు.

Scroll to load tweet…

పోలీసుల వివరాల ప్రకారం, దేశరాజ్ కాలి నడకన ఆ మార్కెట్‌కు వెళ్లాడు. అయితే, ఐదుగురు లేదా ఆరుగురు నిందితులు రెండు బైక్‌లపై అక్కడికి వచ్చి దేశరాజ్‌పై దాడి చేశారు. ఆ గుంపు అతడి వైపు వస్తుండగా దేశరాజ్ పరుగెత్తే ప్రయత్నం చేశాడు.

దాడి జరిగిన తర్వాత కొందరు స్థానికులు వెంటనే ఆ యువకుడిని హాస్పిటల్ తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పారు.