ప్రేమ ఆ బాలిక పాలిట శాపంగా మారింది. ప్రేమించిన వ్యక్తే... ఆ బాలికను అతి దారుణంగా హత్య చేశాడు. ఏకాంతంగా మాట్లాడాలి రమ్మని పిలిచి... కొండపై నుంచి కిందకు తోసేశాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఆరియూర్ కుప్పం ప్రాంతానికి చెందిన శరవణన్ చెప్పుల వ్యాపారి. ఆయనకు నివేద(17) అనే కుమార్తె ఉంది.  నివేద ఇంటర్ పూర్తి చేసింది. కాగా... వేలూరు ప్రైవేటు ఆస్పత్రిలో ని క్యాంటీన్ లో పనిచేస్తోంది. 

కాగా... బాలిక కొనవట్టం ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. కాగా...  బాలిక క్యాంటీన్ లో ఉద్యోగం చేసుకుంటుండగా... అక్కడ మరో యువకుడు పరిచయం అయ్యాడు. అతనితో ప్రేమలో పడి.. తనను పట్టించుకోవడం లేదని ఆమె బాయ్ ఫ్రెండ్ కి అనుమానం కలిగింది.

ఈ క్రమంలో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి బాలికను తీర్థగిరి కొండకు తీసుకెళ్లాడు. మాటమాట పెరగడంతో ఆగ్రహించిన ప్రియుడు బాలికను కొండపై నుంచి కిందికి తోసేశాడు. దీంతో తలకు తీవ్రగాయమై బాలిక మృతి చెందింది. కాగా... బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికను నివేదగా గుర్తించారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 14వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయిందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆమె పనిచేసే చోట, వివిధ ప్రాంతాల్లో విచారించగా.. ప్రియుడే హంతకుడిని తేలింది. దీంతో.. పోలీసులు  నిందితుడిని గుర్తించి... అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.