Asianet News TeluguAsianet News Telugu

యువకుడిని కిడ్నాప్ చేసి.. తలకు తుపాకీ గురిపెట్టి.. బలవంతంగా పెళ్లి

బిహార్‌లో ఓ బలవంతపు పెళ్లి జరిగింది. సోదరి అత్తవారింటి కుటుంబాన్ని కలిసి స్వగ్రామానిక వెళ్తున్న యువకుడిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి సరాసరి సమీప గుడిలోని పెళ్లి మంటపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికి సర్వం సిద్ధం చేసి.. వధువు, కుటుంబ సభ్యులు.. ఆడ పడుచులు అందరూ గుడిలో మంటపం దగ్గర ఉన్నారు. ఆ పెళ్లికి యువకుడు తిరస్కరించగా.. తుపాకీతో బెదిరించి మరీ పెళ్లి జరిపించారు.
 

youth kidnapped and made forcefully marriage in bihar
Author
Patna, First Published Nov 21, 2021, 2:51 PM IST

పాట్నా: ఇంట్లో జరుపుకున్న పండుగ చేసుకుని.. ప్రసాదాన్ని తీసుకుని సోదరి అత్తగారి ఇంటికి బయల్దేరాడు ఆ యువకుడు. ప్రసాదాన్ని ఇచ్చి తిరిగి వస్తుండగా పొరుగు ఊరిలో కొందరు దుండగులు తుపాకులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఆ యువకుడు రాగానే బలవంతంగా సమీపంలోని గుడి దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికి అంతా సిద్ధం చేసి ఉంది. వధువు కూడా తాళి కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పెళ్లి చేసుకోవాల్సిందిగా యువకుడిని బెదిరించారు. చితక బాదారు. అయినా, ఆ యువకుడు ససేమిరా అన్నాడు. వెంటనే తుపాకీ తీసుకుని తలపై పెట్టి బెదిరించారు. తుపాకీ నీడలోనే ఆ యువకుడు బిక్కుబిక్కుమంటు పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బిహార్‌లోని నలందాలో చోటుచేసుకుంది.

ధనూకి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ ఇంట్లో ఈ నెల 11న ఛత్త్ పూజా చేసుకున్నారు. ఈ పూజా తాలూకు ప్రసాదాన్ని తీసుకుని తన సోదరి అత్తారి ఊరు సర్బహదీకి బయల్దేరాడు. వారికి ప్రసాదాన్ని అప్పగించి వెనుదిరిగాడు. పరోహా గ్రామానికి చేరగానే అక్కడ కొందరు దుండగులు తుపాకులు పట్టుకుని నిలబడ్డారు. నితీష్ సమీపించగానే తుపాకీతో బెదిరించి బంధించారు. అక్కడి నుంచి సమీపంలోని ఓ గుడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వధువును వివాహం చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. ఆ యువకుడు ఒప్పుకోలేదు. అందరు కలిసి బెదిరించారు. అయినా అంగీకరించకపోవడంతో భౌతిక దాడికీ దిగారు. అయినప్పటికీ ఆ యువకుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కాలేదు. దీంతో మరోసారి తుపాకీ తీసి ఆయనను బెదిరించారు. చివరికి ప్రాణ భయంతోనే నితీష్ దిగివచ్చాడు. అక్కడే నితీష్‌కు పెళ్లి కొడుకు ముస్తాబు చేశారు. వెంటనే పెళ్లి జరిపించారు.

Also Read: అమానుషం : సంతానం కోసం.. యువతిని కొనుక్కొచ్చి, 16నెలలు బంధించి అత్యాచారం.. సహకరించిన భార్య...

ఈ ఘటన తర్వాత ఆ యువకుడు మాన్‌పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పరోహా గ్రామానికి చెందిన సంజయ్ యాదవ్, గన్నూ యాదవ్ సహా మరికొందరు కలిసి నితీష్‌ను బెదిరించి పెళ్లి మంటపానికి తీసుకెళ్లారని, అక్కడే బలవంతంగా పెళ్లి చేసినట్టు ఫిర్యాదు అందిందని పోలీసు అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు. నితీష్ మైనర్ అని తెలుస్తున్నదని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కాగా, బలవంతపు పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Also Read: పెళ్లైందని దూరం పెట్టిన యువకుడు: కేరళలో యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి

బలవంతపు పెళ్లిలు బిహార్‌లో గతంలో చాలా సర్వసాధారణంగా ఉండేవి. ముఖ్యంగా 1970, 80వ దశకాల్లో ఈ బెడద ఎక్కుగా ఉండేది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ శతాబ్దంలో దాదాపు బలవంతపు పెళ్లిళ్లు జరగడం లేదు. అడపా దడపా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బలవంతపు పెళ్లిలో వివాహం కోసం సర్వం చేస్తారు. వధువు పెళ్లి పీటలపై కూర్చుంటుంది. ఆడపడుచులూ పెళ్లి పాటలు పాడటానికి సిద్ధంగా ఉంటారు. కాగా, పురుషులు వరుడి వేటలో ఉంటారు. ఎవరైనా చదువుకున్న యువకుడు లేదా.. సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు కనిపించగానే కిడ్నాప్ చేస్తారు. పెళ్లి మంటపానికి తీసుకువచ్చి.. వివాహం జరిపిస్తారు. బిహార్‌లో ఇవి చాలా జరిగినా..ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.

Follow Us:
Download App:
  • android
  • ios