ఓ యువకుడికి ఇటీవల భరించలేని కడుపులో నొప్పి వచ్చింది. మాత్రలు వేసుకున్నా తగ్గలేదు. రెండు రోజులైనా నొప్పి తగ్గకపోవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తీరా అతనికి కడుపులో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకొని డాక్టర్లకు కూడా దిమ్మ తిరిగిపోయింది.

అతని ప్రైవేటు పార్ట్ లో మద్యం సీసా ఉండటాన్ని చూసి డాక్టర్లు షాకయ్యారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లా నాగోర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు (29) కి మద్యం సేవించే అలవాటు ఉంది. రెండు రోజుల క్రితం సదరు యువకుడు మద్యం సీసాను... మలమూత్రం బయటకు వచ్చే మార్గం నుంచి లోపలికి చొప్పించుకున్నాడు.

ఆ తర్వాత రోజు నుంచి అతనికి తీవ్రమైన కడుపులో నొప్పి రావడం మొదలైంది. అతనికి కడుపులో నొప్పి ఎందుకు వస్తుందో కుటుంబసభ్యులకు కూడా అర్థం కాలేదు. రెండు రోజులైనా నొప్పి తగ్గకపోవడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు అతనికి స్కానింగ్ తీయగా.. మలమూత్ర మార్గం నుంచి లోపలికి వెళ్లిన మద్యంసీసా కనపడింది.

అయితే.. డాక్టర్లు గట్టిగా అడగగా.. తానే ఆ సీసాను అలా పెట్టుకున్నట్లు అతను చెప్పడం గమనార్హం. కాగా... వెంటనే అతనికి శస్త్ర చికిత్స చేసి ఆ సీసా ను బయటకు తీశారు. కాగా.. అతను అలా సీసా పెట్టుకున్నట్లు కుటుంబసభ్యులకు కూడా తెలియకపోవడం గమనార్హం.

ఇలాంటి కేసులు తమ హాస్పిటల్ కి రావడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్పారు. కాగా.. సదరు యువకుడు మద్యం మత్తులో ఇలాంటి పనిచేశాడనని వైద్యులు భావించారు.