మహారాష్ట్రలో ఓ 25 ఏళ్ల యువకుడు తన ఫీమేల్ ఫ్రెండ్‌తో లాడ్జ్‌కు వెళ్లాడు. వారిద్దరూ సంభోగంలో పాల్గొనగానే ఆ యువకుడు కుప్పకూలిపోయాడు. వయాగ్రా పిల్స్ ఓవర్ డోస్ కారణంగా ఆ యువకుడు మరణించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

నాగ్‌పూర్: మహారాష్ట్రలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఓ 25 ఏళ్ల వ్యక్తి వయాగ్రా పిల్స్ ఎవర్‌డోస్ వేసుకున్నాడు. తత్ఫలితంగా బెడ్‌పైనే కుప్పకూలిపోయాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గాబరా పడింది. పోలీసులు విషయం తెలుసుకుని రూమ్‌కు వచ్చారు. ఆయన బాడీపై ఎలాంటి గాయాలు లేవని, కానీ, జేబులో వయాగ్రా పిల్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. వయాగ్రా ఓవర్ డోసు కారణంగా ఆ యువకుడు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

అజయ్ పర్తేకి అనే 25 ఏళ్ల యువకుడు తన ఫీమేల్ ఫ్రెండ్‌ను తీసుకుని నాగ్‌పూర్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని సావోనెర్‌లోని కేశవ్ లాడ్జ్‌కు వెళ్లాడు. ఆదివారం సాయంత్రం వారు కేశవ్ లాడ్జ్‌కు వెళ్లారు. లాడ్జ్‌లోని రూమ్‌లో వారు సంగమిస్తుండగా హఠాత్తుగా అజయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుప్పకూలిపోయాడు. ఈ పరిణామంతో ఆమె భయపడింది. వెంటనే వారిద్దరి కామన్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసింది. ఆ కామన్ ఫ్రెండ్ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.

పోలీసులు స్పాట్‌కు చేరారు. అజయ్ పర్తేకి బాడీపై ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించుకున్నారు. అయితే, అజయ్ ప్యాకెట్‌లో వయాగ్రా పిల్స్ కనిపించాయి. వయాగ్రా పిల్స్ అధికంగా తీసుకుని ఉండొచ్చని, ఆ ఓవర్‌డోస్ కారణంగానే అజయ్ మరణించి ఉంటాడని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టు మార్టం నిర్వహించడానికి పంపించారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో ఓ నూతన వరుడు ఫ్రెండ్స్ చెప్పారని వయాగ్రా తీసుకున్నాడు. అయితే, నిర్దేశిత ప్రమాణాల కంటే కూడా డోసు పెంచి తీసుకున్నాడు. దీంతో ఆయన లేని సమస్యలు వచ్చి చుట్టుముట్టాయి. ఈ చిక్కులు వారి కాపురానికే ప్రమాదంగా మారాయి. హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. ఈ ఘటన ప్రయాాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.

స్నేహితుల మాటలు విని ఆ నూతన వరుడు రికమెండ్ చేసిన దానికి నాలుగు రెట్లు అధికంగా వయాగ్రా డోసు తీసుకున్నాడు. 200 ఎంజీ వయాగ్రా డోసు తీసుకున్నట్టు తెలిసింది. ఫలితంగా ఆయనకు ఎవరికీ చెప్పుకోలేని వింత సమస్య వచ్చి పడింది. ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా ఈ వయాగ్రా రికమెండ్ చేస్తారు. కానీ, ఈ టాబ్లెట్స్‌ను ఓవర్ డోసుగా తీసుకోవడంతో ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ సరిగా ఫంక్షన్ చేయలేదు. సుమారు 20 రోజుల పాటు ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ ఎరెక్ట్ అయ్యే ఉన్నట్టు ఓ కథనం వెల్లడించింది.