ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికైనా కరోనా లక్షణాలు కనపడినా.. ఆ లక్షణాలు గల వారితో మాట్లాడినా ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కేంద్రానికి వెళ్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఓ మహిళ తన కుమారుడిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కేంద్రానికి పంపింది. దానికి మనస్థాపం చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని సహద్లిపూర్ గ్రామానికి చెందిన సూరజ్ సింగ్ యాదవ్ (23) మహారాష్ట్రలోని నాసిక్‌లో వడ్రంగిగా పనిచేసేవాడు. మే 15 న అతను గ్రామానికి చేరుకున్నాక, అత‌నిని అపోలో కాలేజీలోని క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. అయితే సూర‌జ్ సింగ్ మే 23న  క్వారంటైన్ సెంట‌ర్ నుంచి  పారిపోయి, ఇంటికి వ‌చ్చాడు. 

దీంతో అత‌ని త‌ల్లి, సోద‌రుడు అత‌నితో క్వారంటైన్ కాలాన్ని పూర్తి చేశాకే ఇంటికి రావాల‌ని చెబుతూ, తిరిగి సూర‌జ్‌ను క్వారంటైన్ సెంట‌ర్‌కు దిగ‌బెట్టారు. దీంతో క‌ల‌త చెందిన సూర‌జ్ ఉరివేసుకుని ఆత్మ‌హత్య చేసుకున్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.