Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ వివాహం చేసుకుందని దారుణం .. అక్క తల నరికి సెల్ఫీ దిగిన త‌మ్ముడు

కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. కొడుకుతో కలిసి దారుణంగా హత్యచేసింది తల్లి.. విక్ష‌ణ‌రహితంగా హత్య చేసి..తలను మొండాన్ని వేరు చేశారు అంత‌తో ఆగ‌కుండా.. తలను చేతిలో పట్టుకుని తిరుగుతూ సెల్ఫీలు దిగారు. ఈ దారుణ ఘ‌ట‌న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది.
 

Youth chops sister's head, clicks selfie with it and parades in locality in Aurangabad district
Author
Hyderabad, First Published Dec 6, 2021, 2:51 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

Aurangabad: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.  కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. కొడుకుతో కలిసి దారుణంగా హత్యచేసింది తల్లి.. నిండు గ‌ర్భం అనే క‌నిక‌రం లేకుండా విక్ష‌ణ‌రహితంగా దాడి చేసి.. తలను మొండాన్ని వేరు చేశారు కాసాయి తల్లీకొడులు. అంత‌తో ఆగ‌కుండా.. తలను చేతిలో పట్టుకుని తిరుగుతూ సెల్ఫీలు దిగారు. వికృత చేష్టాలు చేస్తూ.. స్థానికులను భ‌యాభంత్రుల‌కు గురిచేశారు. అనంత‌రం స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయారు ఆ తల్లీ కొడుకులిద్దరూ.. ప్రస్తుతం ఈ సంఘటన ఔరంగాబాద్ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. 

వివరాల్లోకెళ్తే..  ఔరంగాబాద్ కు చెందిన కీర్తిథోర్‌ (19) అనే యువ‌తి ఈ ఏడాది జూన్‌లో తాన‌ని ప్రేమించిన యువకుడితో ఇంట్లోంచి వెళ్ళిపోయి గుడిలో పెండ్లి చేసుకుంది. అనంత‌రం విర్గాన్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ పెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంద‌ని కూతురు పై కక్ష పెంచుకుంది. ఎలాగైనా హ‌త‌మెందించాలని ప్లాన్ వేసింది తల్లి శోభా సంజయ్ మోతే. 

Read Also: https://telugu.asianetnews.com/national/newsblack-day-6th-december-babri-mosque-demolition-anniversary-r3op7f

ఈ నేపథ్యంలోనే గ‌త వారం క్రితం కూతురుకి ఫోన్ చేసింది. త‌న‌ని చూడాలని ఉంద‌ని మామ‌మాట‌లు చెప్పి.. కూతురి ఇంటి అడ్రస్ తెలుసుకుంది.. అనంతరం ఆమె ఇంటికి వెళ్లి ఎప్పటిలానే మాట్లాడింది. ఒకసారి పుట్టింటికి వచ్చి వెళ్లమని కోరింది. తీసుక‌పోవ‌డానికి వచ్చే వారం తమ్ముడు సంకేత్ సంజయ్ మోతే తో వ‌స్తాన‌ని చెప్పి వెళ్ళిపోయింది. 
 
చెప్పిన విధంగానే ఆదివారం మరోసారి తన కొడుకు సంకేత్ ని తీసుకుని కూతురింటికి వచ్చింది త‌ల్లి శోభ‌. పొలం పనిలో బిజీగా ఉన్న కూతురు తల్లి, సోదరుడి చూసి ఎంతో ఆతృత‌తో ఇంటికి వచ్చింది. కాళ్లకు నీళ్లిచ్చి వంటగదిలోకి వెళ్లి టీ పెడుతుండగా.. తనతో మాటలు కలిపారు.

Read Also: https://telugu.asianetnews.com/national/amit-shah-to-give-statement-in-parliament-on-nagaland-firing-r3okvl

దే అదునుగా భావించిన ఆ కసాయి తల్లీకొడుకులు.. త‌మ వెంట తెచ్చుకున్న వేట కొవ‌లితో వెనక వైపు నుంచి కీర్తిథోర్ తలను వేటు వేశారు. కీర్తిథోర్ అర్థ‌నాధాలు విన్నా.. భ‌ర్త ప‌రుగుప‌రుగున వ‌చ్చి వారిని అడ్డుకుని ప్ర‌య‌త్నం చేయ‌గా.. అతనిని కూడా చంపేందుకు ప్రయత్నించారు. అయితే తప్పించుకుని బయటపడ్డాడు. అనంత‌రం విక్ష‌ణార‌హితంగా తల్లి, కుమారుడు, కీర్తి థోర్ తల మొండెం వేరు చేశారు. తలతో సెల్ఫీలు దిగుతూ వికృత చేష్టాలు చేశారు. ఆమె తలను చుట్టుపక్కల వారికి చూపిస్తూ భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేశారు.  

అనంతరం విర్గాన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయారు. పరువు హత్యతో ఔరంగాబాద్ జిల్లా ఉలిక్కిపడింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీకొడుకులిద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios