రోడ్డు మీద జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి వేలు పొగొట్టుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... భోపాల్ కి చెందిన శ్యామ్ మోహర్ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై సోమవారం సాయంత్రం వెళ్తున్నాడు. ఆ సమయంలో అస్ఘర్ ఖాన్ అనే వ్యక్తి స్కూటీ పై వచ్చి.. వీళ్ల వాహనాన్ని ఢీకొట్టాడు.

ఆ సమయంలో ఇరు వాహనాలు నెమ్మదిగా వెళుతుండటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెద్దగా గాయాలు ఏమీ కాలేదు. అయితే... శ్యామ్ మోహర్, అస్ఘర్ లు ఒకరితో మరొకరు పోట్లాడుకున్నారు. ఈ క్రమంలో అస్ఘర్ కి బాగా కోపం వచ్చి.... శ్యామ్ మోహర్ చూపుడు వేలును కొరికేశాడు. అనంతరం దానిని నమిలేశాడు. వేలు తెగడంతో.. రక్తం బాగా కారింది.

తనకొడుకును అస్ఘర్ బూతులు తిట్టాడని అందుకే తాను గొడవ పడ్డానని.. ఆ మాత్రానికి వేలు కొరికేశాడని శ్యామ్ మోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.