బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తనను వదిలేసిందని మాజీ ప్రేయసిపై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని నెలమంగల సోలదేనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 

21 ఏళ్ల వయస్సు గల యువతి బబిత్ ే యువకునితో గత నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగించింది. అయితే, ఇటీవల ఇరువురి మధ్య విభేదాలు పొడసూపాయి. దాంతో ఇద్దరు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత యువతికి రాహుల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆమె అతని ప్రేమలో పడింది. 

కాగా, యువతి కొత్త ప్రియుడి ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా మాజీ ప్రియుడు అక్కడికి వచ్చిన యువతిని హెల్మెట్ తో తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు యువతి స్పృహ తప్పి పడిపోయింది. ఆమె దేహం నుంచి రక్తం కూడా కారింది. అయితే, యువకుడు యువతి తండ్రికి ఫోన్ చేసి మీ కూతురికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు. 

అది యాక్సిడెంట్ కాదు, దాడి అని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కొత్త, పాత ప్రియులిద్దరు మిత్రులని, కొత్త ప్రియుడు సమాచారం ఇవ్వడంతో పాత ప్రియుడు అక్కడికి వచ్ిచ దాడి చేశాడని తెలుస్తోంది. 

అంతేకాకుండా, వారు ముగ్గురు కూడా ఒకే కాలనీకి చెందినవాళ్లు. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బబిత్, రాహుల్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.