ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని ఓ యువతి కలెక్టర్ ఇంటి ముందు ఆత్మహుతి చేసుకోవడానికి సిద్ధపడింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిమీద పోసుకొని నిప్పు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కాగా.. గమనించిన స్థానికులు ఆమె మీద నీళ్లు పోసిరక్షించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....దిండుక్కల్ మేట్టపట్టికి చెందిన దివ్యరోస్లిన్(24) అనే యువతి స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ చదుతోంది. కాగా.. అదే కాలేజీకి చెందిన యువకుడిని ప్రేమించింది. యువకుడు కూడా ప్రేమించాను అని చెప్పి శారీరకంగా వాడుకున్నాడు. కానీ తర్వాత పెళ్లికి మాత్రం నిరాకరించాడు. దీంతో... యువతి పోలీస్ స్టేషన్ లో కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసింది. కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో... ఆత్మహత్యకు పాల్పడింది. కాగా... ఈ ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి... కేసు నమోదు చేసుకున్నారు.