Asianet News TeluguAsianet News Telugu

మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు... పోలీసునే కొట్టాడు..!

జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్ లేకుండా బయటకు రావద్దని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా.. కొందరు పట్టించుుకోకుండా వ్యవహరిస్తున్నారు. 

young man slapped police for asking where is mask
Author
Hyderabad, First Published Apr 24, 2021, 2:00 PM IST

కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. గతేడాది మన దేశంలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి ఆ మధ్య తగ్గుముఖం పట్టినట్లే కనిపించింది. కానీ తిరిగి సెకండ్ వేవ్ లో విజృంభించడం మొదలుపెట్టింది. విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. మళ్లీ లాక్ డౌన్ విధిస్తే.. మధ్య తరగతి, పేదలు ఇబ్బంది పడే పరిస్థితి. 

కాబట్టి.. జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్ లేకుండా బయటకు రావద్దని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా.. కొందరు పట్టించుుకోకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు మాస్క్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు.. ఏకంగా పోలీసునే కొట్టాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలో నిత్యం 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటోంది. పోలీసులు తమ ప్రత్యేక వాహనాల్లో రౌండ్స్ కొడుతూ ఎక్కడైనా ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే.. రఫ్పాడిస్తున్నారు. ఈ క్రమంలో ఖుషీ నగర్‌లో ఓ యవకుడు మాస్క్ లేకుండా దర్జాగా వెళ్తుంటే.. కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే అతన్ని ఆపి జీపులో ఉన్న ఇన్‌స్పెక్టర్ దగ్గరకు పంపాడు. ఇన్‌స్పెక్టర్ ఆ కుర్రాడి కాలర్ పట్టుకొని... "మాస్క్ పెట్టుకోమని ఇంతలా చెబుతుంటే ఎందుకంత నిర్లక్ష్యం.. ఇంత బలుపేంటి... మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు.. పెట్టుకోమని చెబుతున్నాం కదా" అంటూ ఫైర్ అయ్యి చెయ్యి చేసుకున్నాడు.

దీంతో ఆ యువకుడు పెట్టుకుంటాను సార్‌ అని అమాయకుడిలా నటిస్తుంటే.. పోనీలే అని అతనికి ఫైన్ వెయ్యకుండా వదిలాడు ఇన్‌స్పెక్టర్. అంతే ఆ క్షణంలో ఆ కుర్రాడు ఇన్‌స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు. షాకైన ఇన్‌స్పెక్టర్.. రేయ్ అనేసరికి. అక్కడి నుంచి పరుగందుకున్నాడు. అతన్ని పట్టుకుందామని పరుగెత్తిన కానిస్టేబుల్‌కి అతన్ని పట్టుకోవడం కుదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios