దారుణం: న్యూఇయర్ వేడుకల్లో ఘర్షణ.. కేక్ కట్ చేసే కత్తితోనే మిత్రుడిని

న్యూఇయర్ వేడుకల (new year 2022) సందర్భంగా జరిగిన ఘర్షణ ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడు (tamilnadu) రాష్ట్రం గుడియాత్తం సమీపం కొత్తపారికుప్పంకు చెందిన వినీత్‌ (23), అదే గ్రామానికి చెందిన ఆకాష్‌ (22) స్నేహితులు. న్యూఇయర్ సందర్భంగా వినీత్‌, ఆకాష్‌, మరి కొందరు స్నేహితులు డిసెంబర్ 31 (శనివారం) అర్థరాత్రి 12 గంటలకు కేక్‌ కట్‌ చేశారు. ఈ సమయంలో వినీత్- ఆకాశ్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది

young man murder during new year celabrations in tamilnadu

న్యూఇయర్ వేడుకల (new year 2022) సందర్భంగా జరిగిన ఘర్షణ ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు (tamilnadu) రాష్ట్రం గుడియాత్తం సమీపం కొత్తపారికుప్పంకు చెందిన వినీత్‌ (23), అదే గ్రామానికి చెందిన ఆకాష్‌ (22) స్నేహితులు. వినీత్‌ హోసూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ న్యూ ఇయర్‌ నాడు సెలవు వుండటంతో ఇంటికి వచ్చాడు. కొత్త సంవత్సరం సందర్భంగా వినీత్‌, ఆకాష్‌, మరి కొందరు స్నేహితులు డిసెంబర్ 31 (శనివారం) అర్థరాత్రి 12 గంటలకు కేక్‌ కట్‌ చేశారు. 

అయితే ఈ సమయంలో వినీత్- ఆకాశ్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో, ఆగ్రహానికి గురైన ఆకాష్‌ కత్తితో వినీత్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతనిని గుడియాత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వినీత్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మేల్‌పట్టి పోలీసులు ఆకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read:Hanmakonda Crime: న్యూఇయర్ పార్టీలో అపశృతి... క్వారీ గుంతలో శవాలుగా తేలిన యువకులు

కాగా.. తెలంగాణ రాష్ట్రంలోనూ నూతన సంవత్సర వేడుకల్లో (news year celebrations) విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఇద్దరు యువకులు రాత్రంతా కనిపించకుండా పోయి తెల్లారేసరికి క్వారీ గుంతలో శవాలుగా తేలారు. ఈ దుర్ఘటన హన్మకొండ జిల్లాలో వెలుగుచూసింది.  వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా (hanmakonda district) హసన్ పర్తి మండలం చింతకుంట గ్రామానికి చెందిన శ్రీకర్, ఆకాష్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఐదుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోగా కేవలం ముగ్గురు మాత్రమే ఇళ్లకు చేరుకున్నారు. శ్రీకర్, ఆకాష్ కనిపించకుండా పోయారు. 

తమ పిల్లలు ఇళ్ళకు చేరుకోకపోయేసరికి తల్లిదండ్రులు కంగారు పడిపోయి చుట్టుపక్కల వెతికారు. అయితే ఓ క్వారీ గుంతలో ఇద్దరి మృతదేహాలను గుర్తించిన గ్రామస్తులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న వారు కన్న బిడ్డల శవాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios