పొలం గట్ల వద్ద పంచాయతీలు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. భూ తగాదాలతో సొంత వాళ్లపైనే కొందరు కత్తి దూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో చిన్న పొలం గొడవ కాస్తా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.

అందోల్ మండలం మాన్‌సన్‌పల్లిలో సొంత పెదనాన్న రాముడిపై మురళీ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన తమ్ముడు శ్రీకాంత్‌పైనే ప్రతాపం చూపాడు. ఈ గొడవలో రాముడు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.