తమిళనాడులోని తిరువొత్తియూరులో జరిగిన రెండు వేరు వేరు సంఘటనల్లో ముగ్గురు మరణించారు. హొసూరులో వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురికాగా, రాణిపేట జిల్లాలో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.
తమిళనాడులోని తిరువొత్తియూరులో జరిగిన రెండు వేరు వేరు సంఘటనల్లో ముగ్గురు మరణించారు. హొసూరులో వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురికాగా, రాణిపేట జిల్లాలో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.
మొదటి ఘటనలో తమిళనాడులోని హొసూరులో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణం తీసింది. కృష్ణగిరి జిల్లా హొసూరు బేగిపల్లికి చెందిన హరి కుమారుడు శ్రీకాంత్ (21). ఇతను హొసూరు మునేశ్వరనగర్‌లో వున్న బైరోస్ అనే వ్యక్తి మాంసం దుకాణంలో పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో శ్రీకాంత్‌కు, యజమాని భార్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి బైరోస్ శ్రీకాంత్‌ను మందలించాడు. అయినా సంబంధం కొనసాగిస్తుండడంతో శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు నిర్ణయించాడు. ఈ క్రమంలో బుధవారం శ్రీకాంత్‌ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి హత్య చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండో ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లాలో చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా కలవై సమీపంలో వాలైపందల్ లో ప్రియుడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో మనస్తాపం చెంది ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది.
వాలైపందల్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు మెకానిక్. ఇతనికి పొరుగు గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతికి మరో యువకుడితో వివాహం చేయడానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు.
విషయం తెలిసి ప్రియుడు మనస్తాపం చెంది మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి దహన సంస్కారాలు చేస్తుండగా విరక్తి చెందిన ఆ యువతి అదేసమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
