రైతులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడట్లేదు.. దారి చూపండి: సీఎంకు రైతు సంఘాల విజ్ఞప్తి
యువ అన్నదాతలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదని రైతు సంఘాల నాయకులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. యువ రైతును పెళ్లి చేసుకునే యువతికి రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలిన వారు సీఎంను డిమాండ్ చేశారు.
Farmers: ఆరుగాలం కష్టపడే యువ రైతులకు కుటుంబ జీవితం దక్కడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 45 ఏళ్లు నిండినా యువ రైతులు అవివాహితులుగానే ఉండిపోతున్నారని వివరించారు. రేయింబవళ్లు పొలంలో పని చేసే యువ రైతులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదని, యువ రైతులను పెళ్లి చేసుకోవడానికి అయిష్టత చూపుతున్నారని బాధపడ్డారు. ఇదే విషయాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు చెప్పారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం సిద్ధరామయ్య రైతు సంఘాలతో భేటీ అయ్యారు. సాగు రంగానికి కేటాయింపులపై సీఎం మాట్లాడారు. పలు పథకాల అమల, ప్రయోజనాలను రైతు నాయకులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ఈ భేటీలో రైతు సంఘాల నేతలు సీఎం సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు.
Also Read : Evil: ఏపీలోని ఆ గ్రామంలో భయానక అదృశ్య శక్తి? తెల్లార్లు మెలకువతోనే యువత కాపలా.. అసలేం జరుగుతున్నది?
సాగునే నమ్ముకున్న యువ రైతులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదని వాపోయారు. 45 ఏళ్లు వచ్చినా అవివాహితులుగానే ఉండిపోతుననారని చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తెలిపారు. యువ రైతులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. తద్వార యువ రైతుల కుటుంబ భవిష్యత్ కు తోడ్పడాలని వివరించారు. ఈ మేరకు విజ్ఞప్తి పత్రాన్ని ఇచ్చారు.