ముంబై:ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో  మనోవేదనకు గురైన తెలుగు యువతి మహారాష్ట్రలోని భీవండిలో ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని భీవండిలో కామత్‌ఘర్‌కు చెందిన 21 ఏళ్ల స్వాతి వేముల, బాలాజీ నగర్‌కు చెందిన సాయిచంద్ర మాచర్ల గత నాలుగేళ్లుగా ప్రేమించుకొంటున్నారు.

అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకొందామని స్వాతి చెప్పడంతో  సాయిచంద్ర నిరాకరించాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వాతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. స్వాతి ఆ్మహత్యకు కారణమైన సాయిచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిచంద్ర మాచర్ల ఎందుకు స్వాతిని పెళ్లి ఎందుకు చేసుకోనేందుకు నిరాకరించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.