లక్నో: ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠన చర్యలు తీసుకున్నా మహిళలకు రక్షణ లభించడంలేదు. దేశంలో ప్రతి నిమిషం ఏదోఒకచోట మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు జరుగుతూనే వున్నాయి. బయటకు వెళ్లినవారే కాదు ఇంటిదగ్గరున్న మహిళలూ కామాంధుల చేతిలో నలిగిపోతున్నారు. ఇలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతిని ఇంటినుండే ఎత్తుకెళ్లిన ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.   

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబాలో ఓ యువతి(16) బాలికపై ఇద్దరు యువకులు కన్నేశారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి యువతి ఇంటిబయట వుండగా గమనించిన యువకులు జైహింద్ (23), ఆశిష్ సేన్(22)లు బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లారు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను యువతికి  అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. 

అక్కడినుండి ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. నిందితులైన జైహింద్, ఆషిష్ సేన్ లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.