మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడు  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నకళ్యాణ్ రైల్వే స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. 

అయితే రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మృతదేహంతో పాటు ఓ మొబైల్ ఫోన్ ను గుర్తించారు.

ఆ మొబైల్ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించిన పోలీసులకు షాకింగ్ వీడియో కనిపించింది. అతడు తన ఆత్మహత్యకు ముందు ఓ వీడియో రికార్డు చేశాడు. అందులో తన పేరు రోహిత్ పరదేశీగా పేర్కొంటూ...తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ తెలిపాడు. తన మానసిక ఇబ్బందులు, కష్టాల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ ఆధారంగా మృతిడి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.