తమిళనాడు తిరువళ్లూరులో విషాదం

సరదాగా వర్షంలో ఫోటోలు తీసుకుంటున్న ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాడు. అతడికి సమీపంలో పిడుగు పడటంతో దాన్ని ఫోన్ లో బంధించాలని భావించిన యువకుడు ఆ వేడికి తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తమిళనాడులోని తిరువళ్లూరులో రమేష్ అనే యువకుడు తన స్నేహితుడి రొయ్యల ఫాం కు సరదాగా వెళ్లాడు. అయితే అదే సమయంలో వర్షం మొదలై వాతావరణం ఆహ్లాదకంగా తయారయ్యింది. దీంతో రమేష్ ఆ వర్షంలో ఫోటోలు దిగడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆకాశంలో ఉరుములు, మెరుపులు మొదలవడంతో వాటిని కూడా తన మొబైల్ లో బంధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడి సమీపంలో ఓ పిడుగు పడటంతో ఒళ్లు కాలిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు.

దీన్ని గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అయితే ముఖం, ఛాతి బాగాల్లో తీవ్రంగా కాలినగాయాలవడంతో అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.