Asianet News TeluguAsianet News Telugu

దేశం గర్వపడేలా చేశారు: టర్కీలో పనిచేసిన రెస్క్యూ బృందంపై మోడీ ప్రశంసలు

టర్కీ, సిరియాల్లో భూకంప  ప్రాంతాల్లో  సహయక చర్యల్లో పాల్గొని  ఇండియాకు  తిరిగి వచ్చిన  రెస్క్యూ టీమ్‌లతో  ప్రధాని నరేంద్ర మోడీ  ఇవాళ భేటీ అయ్యారు. 

You've made India proud: PM Modi to rescue teams returned from quake-hit Turkey
Author
First Published Feb 20, 2023, 7:59 PM IST

న్యూఢిల్లీ:   టర్కీలోని  భూకంప ప్రాంతాల్లో  సహాయక చర్యల్లో  పాల్గొన్న రెస్క్యూ సిబ్బందిని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు.   మీరు మానవాళికి  గొప్ప సేవ చేశారు. భారతదేశం  గర్వపడేలా  చేశారని   రెస్క్యూటీమ్‌లపై  మోడీ ప్రశంసలు కురిపించారు.  

ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా   భూకంపం సంభవించిన  టర్కీలో  సహాయక చర్యలు  చేపట్టిన  ఎన్‌డీఆర్ఎఫ్  సహా ఇతర  రెస్క్యూ సిబ్బందితో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  సోమవారం నాడు భేటీ అయ్యారు.  

ఈ సందర్భంగా  ఆయన  ప్రసంగించారు. భారతదేశం  మానవ ప్రయోజనాలకు  అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మోడీ  చెప్పారు.  భూకంపం  సంభవించిన  ప్రాంతాల్లో  రెస్క్యూ సిబ్బంది చేసిన సేవలను ప్రపంచం  చూసిందని  ఆయన  గుర్తు  చేశారు. భూకంప బాధిత ప్రాంతాల్లో  చేసిన  సహాయక సిబ్బంది  చేసిన సేవలను ఆయన  ప్రశంసించారు.  భూకంప ప్రాంతాల్లో  మన డాగ్ స్క్వాడ్  కూడా అత్యుత్తమమైన  శక్తి, సామర్ధ్యాలను  ప్రదర్శించినట్టుగా  ప్రధాని  చెప్పారు.  

మన సంస్కృతి  మనకు  వసుధైక కుటుంబం గురించి  నేర్పిన విషయాన్ని మోడీ గుర్తు  చేశారు.  ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా  పరిగణిస్తామన్నారు.   కుటుంబంలో  ఒకరు కష్టాల్లో  ఉన్నప్పుడు వారిని  ఆదుకోవడం  భారతదేశం కర్తవ్యంగా  ఆయన  సేర్కొన్నారు.

 

2001లో  గుజరాత్  రాష్ట్రంలో  భూకంపం వచ్చిన సమయంలో  తాను  వాలంటర్ గా  పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు  చేసుకున్నారు.  ప్రజలను రక్షించుకొనేందుకు  తాను ఎదుర్కొన్న  ఇబ్బందులను  ఆయన గుర్తు  చేసుకున్నారు. 

ఇతరులకు  సహయం  చేసినప్పుడు  అతను నిస్వార్ధపరుడిగా  పేర్కొన్నారు.  ఇది వ్యక్తులకు  కాదు దేశాలకు  కూడా వర్తిస్తుందని  ప్రధాని  చెప్పారు.  భూకంప బాధిత ప్రాంతాల్లో  సేవ  చేసిన  సహాయక సిబ్బందికి తాను సెల్యూట్  చేస్తున్నట్టుగా  ప్రధాని  చెప్పారు.దేశం  గత కొన్నేళ్లుగా  స్వయం సమృద్ది  కలిగిన దేశంగా  గుర్తింపును బలోపేతం  చేసిందన్నారు.ప్రపంచంలో  ఎక్కడ సంక్షోభం  వచ్చినా  కూడా  ఇండియా  మొదట స్పందించనుందని  ఆయన  తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios