రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు.. స్మృతి ఇరానీపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్..
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేదని రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ అన్నారు. రాహుల్ గాంధీ కాదు.. స్మృతి ఇరానీ కపటంగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ హయంలో గ్యాస్ ధర రూ.450 ఉంటేనే.. తలపై గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని తిరిగిన ఆమె ...ఇప్పుడు అదే గ్యాస్ ధర రూ.1200కి చేరువయ్యేది.. అయినా.. ఆ విషయం గురించి మాట్లాడటం లేదని విమర్శించారు.

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గారి మండిపడ్డారు. రాహుల్ గాంధీ కాదని, స్మృతి ఇరానీ కపటంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్యాస్ ధర రూ.450 ఉన్న సమయంలో తలపై గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని తిరిగిన ఆమె.. ఇప్పుడు అదే గ్యాస్ ధర రూ.1200కి చేరువయ్యేనా.. ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉల్లి 10, 20 రూపాయలు ఉన్నప్పుడు మెడలో దండ వేసుకునేవారు, ఇప్పుడు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు. ఈసారి కాంగ్రెస్ ట్రాప్‌లోకి బీజేపీ వచ్చిందని అన్నారు. తాము నిజమైన సమస్యలపై పోటీ చేస్తున్నామనీ, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అని చివరి ప్రయత్నం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు.
రాహుల్ గాంధీపై బీజేపీ స్మృతి ఇరానీ విమర్శలు
అంతకుముందు .. కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ చేసిన 'జై సియారాం' ప్రకటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దాడికి దిగింది. రాహుల్ గాంధీ సనాతన ధర్మాన్ని వంచన చేస్తారని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. కేవలం ఎన్నికలను బట్టి లేదా రాజకీయాలను బట్టి మతాన్ని నిర్వచించే సాహసం చేస్తాడని విమర్శలు గుప్పించారు. అలాగే..రాహుల్ గాంధీకి మహిళలపై గౌరవం ఉంటే.. మల్లికార్జున్ ఖర్గే స్థానంలో ఒక మహిళను పార్టీ అధ్యక్షుడిగా నియమించేవారని అన్నారు. కాంగ్రెస్ లో ఖర్గేకు ముందు గాంధీ కుటుంబం తప్ప వేరే వారు అధ్యక్షపదవీని అధిష్టించలేదని అన్నారు. రాహుల్ గాంధీకి తనపై ఇంత నమ్మకం ఉంటే.. హిమాచల్, గుజరాత్ ఎన్నికలకు గైర్హాజరు అయ్యేది కాదు.. కానీ ఓటమి బాధ తన తలపై పడకూడదనే ఉద్దేశ్యపూర్వకంగా రావడం లేదని విమర్శించారు.
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ లాభపడిందా?
భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ప్రకటనను స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ఈ విజయం ఓటమికి సంబంధించినది కాదని, ప్రజలకు ప్రధాని మోదీపై ఉన్న ప్రేమ కోసమేనని అన్నారు. ఈ ఎన్నికలు గుజరాత్ ప్రజలు తమ కొడుకును గెలిపించుకోవడం జరుగుతున్నాయనీ, గుజరాత్ ఎన్నికలకు గాంధీ కుటుంబం దూరం కావడం..బహుశా ఇదే తొలిసారి అని అన్నారు.
ప్రధాని మోదీ ఉద్దేశించి.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన రావణ ప్రకటనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకపడ్డారు. "గాంధీ కుటుంబం సంకుచితంగా వ్యవహరిస్తుందని అన్నారు. గుజరాత్ లో బీజేపీ తప్ప మరోపార్టీ విజయం సాధించలేదని అన్నారు. ఎవరికి ఎలాంటి హోదా ఉందో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం నెలకొందని, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ల మధ్య అంతర్గత పోరు జరుగుతోందని అన్నారు.
కేజ్రీవాల్ ప్రకటనపై స్మృతి ఇరానీ ఫైర్
సీఎం భగవంత్ మాన్ విలేకరుల సమావేశం కూడా చూశానని, అందులో అరవింద్ కేజ్రీవాల్ వస్తే ఉద్యోగాలన్నింటినీ ఆపేస్తానని అన్నారనీ, అతను నిజం చెబుతున్నాడా? లేదా? అతని నోటి నుండి నిజం వచ్చిందా? లేదా? అనేది ప్రజలే తెలుసుకోవాలని అన్నారు. ఏది ఏమైనా అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, అరవింద్ కేజ్రీవాల్ పిలుపు మేరకు గుజరాత్ లోని పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రధాని తల్లి గురించి మాట్లాడే మాటలు ఆమోదయోగ్యం కావని అన్నారు.
ఒవైసీ ప్రకటనపై స్మృతి ఇరానీ ఇలా అన్నారు
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఏఐఎంఐఎం అధినేత అదుద్దీన్ ఒవైసీని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరిని భయపెడుతున్నాడు. తన సొంత సమాజంలోని ప్రజలను ఎందుకు భయపెడుతున్నాడు. ఏ భాజపా నాయకుడైనా తన మతాన్ని విడిచిపెట్టాలని ప్రకటన చేశాడు. మనం ఏ మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదని అన్నారు. ఎక్కడో ఒకచోట చట్ట ఉల్లంఘన జరిగితే.. ఫలానా వర్గానికి ప్రత్యేక చట్టం ఉండాలని ఒవైసీ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.