Asianet News TeluguAsianet News Telugu

మీరూ జులైలో టీకా తీసుకున్నారంటగా: రాహుల్‌ వ్యాక్సిన్ కొరత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కౌంటర్

దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కౌంటరిచ్చారు. దేశంలో టీకా కొరత లేదని.. రాహుల్‌లోనే పరిపక్వత లోపించిందని సెటైర్ వేశారు.
 

You also got vaccinated in July Mansukh Mandaviya retorts to Rahul Gandhis vaccine shortage tweet ksp
Author
New Delhi, First Published Aug 1, 2021, 7:50 PM IST

దేశంలో టీకాల కొరత ఉందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కౌంటరిచ్చారు. దేశంలో టీకా కొరత లేదని.. రాహుల్‌లోనే పరిపక్వత లోపించిందని సెటైర్ వేశారు. జులై నెలలో 13 కోట్ల టీకా డోసులు వేశామని... ఇలా టీకా డోసు తీసుకున్న వారిలో మీరూ ఉన్నట్టు నేను విన్నానని మాండవీయ వ్యాఖ్యానించారు. కానీ రాహుల్ ఏ రోజూ భారత శాస్త్రవేత్తల కష్టాన్ని ప్రశంసించలేదని... టీకాలు తీసుకోవాలంటూ ప్రజలను ప్రోత్సహించలేదని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. వ్యాక్సినేషన్ పేరిట రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారంటూ మన్సుఖ్ మాండవీయ మండిపడ్డారు.  .’’ అని ఆయన కామెంట్ చేశారు. 

కాగా, జులై నెల వెళ్లిపోయింది.. కానీ, వ్యాక్సిన్ల కొర‌త మాత్రం పోలేదు అంటూ రాహుల్ గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. రాహుల్ కి కొన్ని నెల‌ల క్రితం క‌రోనా సోక‌గా, అనంత‌రం చికిత్స తీసుకుని కోలుకున్నారు. జులై 28న ఆయ‌న తొలి డోసు క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios