Asianet News poll: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌నీ, బీజేపీకి యోగి నే 'ఉప్'యోగి' అవుతారని ఏషియానెట్ న్యూస్ పోల్ అంచనా వేసింది. 7 నెలల క్రితం క్షేత్ర స్థాయిలో చేసిన స‌ర్వే ఫ‌లితాలు నేడు నిజరూపం దాల్చాయి. ఏషియానెట్ న్యూస్ పోల్ అంచ‌నాలు నిజ‌మయ్యాయి.   

Asianet News poll: సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఐదింట‌.. నాలుగు రాష్ట్రాల్లో క‌మ‌లం విజ‌య‌కేత‌నాన్ని ఎగ‌ర‌వేసింది. భార‌త్ కు గుండె లాంటి యూపీలో మ‌రోసారి భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో క‌మ‌ల వికాసం క‌నిపించింది. ఈ రాష్ట్రాల‌లో బీజేపీ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది.

ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌లు చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగాయి. బీజేపీ మ‌రో సారి విజ‌యం సాధించి.. గత చరిత్రను బ‌ద్ద‌లుకొట్టింది. సరికొత్త చరిత్రను సృష్టించింది. యూపీలో బీజేపీ తిరుగులేని, ఎదురులేని పార్టీగా అవ‌త‌రించింది. యూపీలో బీజేపీ చేసిన దండ‌యాత్ర‌తో స‌మాజ్ వాదీ పార్టీ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. బీజేపీ మ‌రోసారి మ్యాజిక్ ఫిగ‌ర్ ను క్రాస్ చేసింది అధికారం ద‌క్కించుకుంది. గత ఎన్నిక‌ల్లో 312 సీట్లు సాధించినా.. ఈ సారి 273 సీట్లు సాధించింది. యూపీ కొలనులో కమలం మళ్లీ వికసించింది. మరింతగా విరబూసింది. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ మ‌రో సారి అధికారంలోకి వ‌స్తుంద‌నీ, బీజేపీకి యోగి నే 'ఉప్'యోగి' అవుతారని 7 నెలల క్రితం ఏషియానెట్ న్యూస్ పోల్ అంచనా వేసింది. క్షేత్ర స్థాయిలో చేసిన స‌ర్వే ఫ‌లితాలు నేడు నిజ రూపం దాల్చాయి. ఏషియానెట్ న్యూస్ పోల్ అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. ఉత్తరప్రదేశ్ లో ఎన్నిక‌ల‌కు ఏడు నెలల ముందే.. అంటే.. ఆగస్ట్ 2021లో ఏషియానెట్ న్యూస్.. జన్ కీ బాత్ మూడ్ ఆఫ్ వోటర్స్ అనే పేరింట క్షేత్ర స్థాయిలో స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం.. యోగి ఆదిత్యనాథ్ రెండవసారి ముఖ్యమంత్రిగా తిరిగి వస్తుందని అంచనా వేసింది.

యుపి ఎన్నికల ఫలితాలు యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేస్తారని ఆసియానెట్ న్యూస్ పోల్ 7 నెలల క్రితం అంచనా వేసింది. 2024లో జ‌రగ‌బోయే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ప్ర‌స్తుతం జ‌రిగిన ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు సెమీ ఫైన‌ల్స్ గా భావించి.. ఏషియానెట్ న్యూస్.. గ‌తేడాది ఆగ‌స్ట్ లో జన్ కీ బాత్ మూడ్ ఆఫ్ వోటర్స్ అనే పేరుతో క్షేత్ర స్థాయిలో స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం.. ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి అనుకూలమైన విజయాన్ని అంచనా వేసింది. 51 శాతం మంది ఓటర్లు యోగిని తదుపరి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని తెలిపింది.

ఏషియానెట్ న్యూస్ టీం.. యుపిలోని కాన్పూర్ బుందేల్‌ఖండ్ అవధ్, వెస్ట్, బ్రిజ్, కాశీ, గోరక్ష్‌లో విస్తృతమైన సర్వే జరిగింది. ఈ ప్రాంతంలో నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం.. 42 శాతం ఓట్లతో బీజేపీకి 222-260 సీట్లు వస్తాయని, ఎస్పీ కేవ‌లం135 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆధిక్యత ప్రకారం బీజేపీ 273 స్థానాల్లో గెలుపొందింది. బిఎస్‌పి సింగిల్ డిజిట్‌లో ప‌రిమితం అవుతుంద‌ని వెల్లడించి.. స‌ర్వే ప్ర‌కార‌మే.. కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకుంది.

ప్ర‌ధానంగా.. కాంగ్ర‌స్ దయనీయమైన దుస్థితిని ఎదురుకుంటుంద‌నీ ఆసియానెట్ న్యూస్ అంచనా వేసింది. బీఎస్పీ మాదిరిగానే కాంగ్రెస్ కూడా సింగల్ డిజిట్ కు ప‌రిమిత‌మైంది. కేవ‌లం రెండు స్థానాల‌ను మాత్ర‌మే కైవ‌సం చేసుకుంది. ఏషియానెట్ స‌ర్వే ప్ర‌కారం..అఖిలేష్‌కు 38 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతనిచ్చారని, మాయావతి కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే తెలిపింది. ప్రియాంక గాంధీ వాద్రా క్రేజ్ మరింత తక్కువగా అవుతుంద‌ని స‌ర్వే తెలిపింది. ఏషియానెట్ సర్వే ఫ‌లితాలు దాదాపు నిజ‌మయ్యాయి. 

యూపీలో మ‌రోసారి క‌మ‌ల వికస్తుంద‌ని, బీజేపీ గెలుపున‌కు దోహ‌దం చేసే.. కార‌ణాల‌ను ఏషియా నెట్ స‌ర్వే గ‌త ఏడు నెల‌ల క్రిత‌మే వివ‌రించింది. 

యోగి మ‌రోసారి సీఎం కావడానికి దోహ‌దం చేసే కార‌ణాలుగా.. ఏషియానెట్ స‌ర్వే తెలిపిన కార‌ణాలివే..

1. అయోధ్యలో రామమందిర నిర్మాణం.. బీజేపీ ఇచ్చిన మాట ప్ర‌కార‌మే.. అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణాన్ని ప్రారంభింది. ఇది బీజేపీకి క‌లిసివ‌చ్చిన అంశంగా ప్ర‌క‌టించింది. 

2. అవినీతిపై యోగి ఉక్కుపాదం.. ప్రధానంగా పశ్చిమ, అవధ్, కాన్పూర్ బుందేల్‌ఖండ్‌లలో -- అవినీతి నియంత్రణలో ఉందని, అలాగే.. చిన్నారుల‌కు, మ‌హిళ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేలా భ‌ద్ర‌తా ఏర్పాటు. ఇది కూడా విజ‌యానికి దోహ‌దం చేసింది.

3. కరోనా కష్ట‌కాలంలో యూపీ ప్ర‌జ‌ల‌కు యోగి స‌ర్కార్ అండ‌గా నిల్చుంది. ఈ స‌మ‌యంలో యోగి ఆదిత్యనాథ్ స‌ర్కార్.. కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి తీవ్రంగా శ్ర‌మించింది. ఈ స‌మ‌యంలో పేద ప్ర‌జ‌ల‌కు కాపాడటానికి రేష‌న్ విధానాని తీసుక‌వ‌చ్చింది. 

4. యూపీలో సాగు చ‌ట్టాలపై ఆందోళనలు చాలా చర్చనీయాంశమైనప్పటికీ, ఈ నిర‌స‌న‌ల ప్ర‌భావం.. కేవ‌లం పశ్చిమ యుపిలో మాత్రమే ఉందని స‌ర్వే వెల్ల‌డించింది. అయితే వ్యవసాయ బిల్లును రద్దు చేయడంతో ఈ విష‌యం కూడా.. బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. 

ఆసక్తికరమైన విషయమేమిటంటే, 50 శాతానికి పైగా వ్యవసాయ బిల్లును చదవలేదని, అర్థం చేసుకోలేదని ఏషియానెట్ స‌ర్వేలో వెల్ల‌డైంది. దాదాపు 60 శాతం మందికి బిల్లుపై ఎలాంటి అభిప్రాయం లేదనీ.. ఎన్నికల నాటికి ఫార్మ్ బిల్లు ప్ర‌భావం ఉంద‌ని ఆసియానెట్ న్యూస్ స‌ర్వే స్ప‌ష్టంగా వెల్ల‌డించింది.
అలాగే.. విద్యుత్ బిల్లు అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తినప్పటికీ తమపై ఎలాంటి ప్రభావం లేదని 70 శాతం మంది పేర్కొన్నారు. ఇక కుల వారిగా చూసుకుంటే.. బ్రాహ్మణుల కుల ధోరణికి సంబంధించిన కీలకమైన అంశాన్ని ఏషియానెట్ అధ్యయనం చేసింది. కాన్పూర్ బుందేల్‌ఖండ్‌లో 36 శాతం మంది తాము నిర్ణయించుకోలేదని చెప్పారు. ఇలా గ‌త ఏడు నెల‌ల కిత్రం ఏషియానెట్ చేసిన స‌ర్వే ఫ‌లితాలు నేడు వెల్ల‌డైన ఫ‌లితాలు ఓకే తీరుగా ఉన్నాయి.