ఆకలిలో అలమటిస్తున్న పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యం తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, ఆంధ్రప్రదేశ్ ‌లో అన్న క్యాంటీన్లను ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి.. విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. 

ఆకలిలో అలమటిస్తున్న పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యం తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, ఆంధ్రప్రదేశ్ ‌లో అన్న క్యాంటీన్లను ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి.. విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఈ స్ఫూర్తితో దేశంలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని చూస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని భావించింది.

పది రూపాయలకే ఫుల్ మీల్స్ అందించే పథకాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి ప్రారంభించాడు. తొలుత దీనిని అలహాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని నిధులను నగరపాలక సంస్థకు అందించాడు.

దీనిలో కేవలం పది రూపాయాలకే సబ్బిడిపై భోజన పథకాన్ని అలహాబాద్ మేయర్ ప్రారంభించారు. నిరుపేదలు, దివ్యాంగులు, సాధువులకు ఫుల్ మీల్స్ అందించాలని మేయర్ తెలిపారు. దీనికి ‘‘యోగి థాలీ’’ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమం ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.