2047 నాటికి యూపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యోగి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇండియా ఆర్థిక వ్యవస్థలో 20% వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Lucknow: ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యోగి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మూడు లక్ష్యాలు, మూడు థీమ్‌లు, 12 రంగాలపై దృష్టి సారించారు… ఈ ప్రణాళిక యూపీ ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక, సాంస్కృతిక పురోగతి, భద్రతలో కొత్త ప్రమాణాలు నెలకొల్పేలా ఉన్నాయి.
ఈ ప్రణాళికలో ‘భద్రత, సుపరిపాలన’ అతి ముఖ్యమైనది. బలమైన ఆర్థిక వ్యవస్థకు భయం లేని, సురక్షితమైన, పారదర్శకమైన పరిపాలన చాలా అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఈ లక్ష్యం కోసం హోం డిపార్ట్‌మెంట్, సాధారణ పరిపాలన శాఖల ద్వారా నిరంతర కృషి జరుగుతోంది.
2030 నాటికి ప్రతి జిల్లాలో ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌లను ఏర్పాటు చేయడం, జిల్లా స్థాయి అభివృద్ధి, మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేయడం, ప్రతి ఇంటికి, సంస్థకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి రోడ్డు భద్రతలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు సాధించడం, ‘జీరో యాక్సిడెంట్ విజన్’ను సాకారం చేయడం, పూర్తి పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
స్మార్ట్ గవర్నెన్స్, స్మార్ట్ పోలీసింగ్, జీరో టాలరెన్స్ సూత్రాలను ప్రభుత్వం అవలంబిస్తోంది. రియల్-టైమ్ మానిటరింగ్ డాష్‌బోర్డ్‌లు, ఫలితాల ఆధారంగా బడ్జెటింగ్, రోడ్డు భద్రతా అమలు, వ్యాపార సౌలభ్యం, నేరాలు, అవినీతిపై కఠిన చర్యలు, పోలీసుల ఆధునికీకరణ వంటివి ప్రధాన దృష్టి రంగాలుగా పెట్టుకుని యోగి సర్కార్.
స్వల్పకాలిక లక్ష్యాలు (2029–30):
స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రతి పౌరుడి భద్రత, ముఖ్యంగా మహిళలు, వ్యాపారులు, రైతులు, పేదల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని జిల్లాల్లో సిసి టివి కెమెరాలు, ఏఐ ఆధారిత నిఘా, ఆధునిక కమాండ్ సెంటర్‌ల నెట్‌వర్క్‌ను విస్తరించడం. ఇ-గవర్నెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ ఆధారిత నిర్ణయం తీసుకునే వ్యవస్థల ద్వారా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రియల్-టైమ్ డాష్‌బోర్డ్ ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులు, వనరుల వినియోగాన్ని పర్యవేక్షించాలని నిర్ణయించారు.
మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు:
ఆధునిక అమలు, పర్యవేక్షణ విధానాలతో ‘జీరో యాక్సిడెంట్ విజన్’ను సాకారం చేయాలని చూస్తున్నారు. సమగ్ర జిల్లా అభివృద్ధి, మాస్టర్ ప్లాన్‌ల ద్వారా సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించనున్నారు. స్మార్ట్ గ్రిడ్‌లు, ఇ-మీటరింగ్, డిజిటల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌కు మద్దతుగా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని ఇవ్వాలని యోగి సర్కార్ భావిస్తోంది.
2017, 2025 మధ్య యోగి ప్రభుత్వం భద్రత, పాలనను మెరుగుపరచడానికి చారిత్రాత్మక చర్యలు తీసుకుంది. 2.19 లక్షల మంది కొత్త పోలీసు సిబ్బందిని నియమించారు, 1.53 లక్షల మందికి పదోన్నతులు కల్పించారు. 243 మంది నేరస్థులను ఎన్‌కౌంటర్లలో హతమార్చారు, 21,023 మంది వాంటెడ్ నేరస్థులను అరెస్టు చేశారు, 83,144 మందిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద 47,422 CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 12.42 లక్షలకు పైగా CCTVలు ఏర్పాటయ్యాయి.
మహిళల భద్రతను బలోపేతం చేయడానికి 9,172 మంది మహిళా బీట్ కానిస్టేబుళ్లను నియమించారు, మూడు మహిళా బెటాలియన్‌లను ఏర్పాటు చేశారు, ఐదు కొత్త PAC బెటాలియన్‌లకు ఆమోదం తెలిపారు. ‘ఆపరేషన్ కన్విక్షన్’ కింద 1,04,718 మంది నేరస్థులకు శిక్ష పడింది, వీరిలో 70 మందికి మరణశిక్ష, 8,785 మందికి జీవిత ఖైదు విధించారు. ₹1.44 లక్షల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు, దీంతో మాఫియా, నేర సిండికేట్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో వికసిత యూపీ @2047 లక్ష్యాన్ని సాధించాలంటే రాష్ట్రం ఏటా 16% వృద్ధి రేటును కొనసాగించాలి. దీంతో 2047 నాటికి తలసరి ఆదాయం ₹26 లక్షలకు పెరుగుతుంది, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తరప్రదేశ్ 20% వాటాను అందిస్తుంది. సురక్షితమైన, భయం లేని, పారదర్శకమైన ఉత్తరప్రదేశ్ మాత్రమే నిజమైన వికసిత భారతానికి పునాదిగా ఉంటుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
