ఐఐటి చదువుకు అడ్డొచ్చిన పేదరికం ... దళిత బిడ్డకు యోగి అండదండలు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గొప్ప మనసు చాటుకున్నారు. చదువుల్లో రాణిస్తున్న ఓ నిరుపేద విద్యార్థికి యోగి ప్రభుత్వమే ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది.

 

Yogi Government Supports Dalit Student's IIT Dream With Full Scholarship AKP

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి పేదల పక్షపాతినని నిరూపించుకున్నారు. పేదలకు ఏ కష్టం వచ్చినా అండగా వుంటానని భరోసా ఇచ్చారు. ఇలా నిరుపేద విద్యార్థి చదువుల్లో రాణిస్తున్నా ఉన్నత చదువులు చదివించే ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేేదు. ఈ విషయం తెలిసి వెంటనే స్పందించిన సీఎం యోగి విద్యార్థి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు.

ముజఫర్‌నగర్‌కు చెందిన దళిత విద్యార్థి అతుల్ కుమార్ ఐఐటి ధన్‌బాద్‌లో ప్రవేశం పొందేందుకు యోగి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్రంలోని స్కాలర్‌షిప్ పథకం కింద, సామాజిక సంక్షేమ శాఖ ఐఐటి ఫీజును పూర్తిగా భరిస్తుంది, తద్వారా అతుల్ విద్య కొనసాగేలా చూస్తుంది.

ముజఫర్‌నగర్ జిల్లాలోని ఖతౌలి తహసీల్‌లోని టిటోడా గ్రామానికి చెందిన రోజువారీ కూలీ రాజేంద్ర కుమార్ కుమారుడు అతుల్ కుమార్ చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకు. అతడు చిన్నప్పటినుండి ప్రభుత్వ పాఠశాలలోనే చదివినా చాలా కష్టపడేవాడు. కుటుంబ ఆర్థికపరిస్థితి తెలుసు కాబట్టి తన చదువు మరింత భారం కాకూడదని భావించేవాడు.  

అయితే ఇంతకాలం ఎక్కువగా ఖర్చు లేకుండానే అతుల్ చదువు సాగింది. కానీ ఇటీవల అతడికి ధన్ బాద్ ఐఐటీలో సీటు వచ్చింది. అయితే ఐఐటీలో సీటు వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు...కాానీ అతుల్ పరిస్థితి అలాకాదు. ఐఐటీలో చదవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని... అంత డబ్బు తన కుటుంబం భరించలేదని అతడికి తెలుసు. అందువల్లే ఐఐటీలో సీటు వచ్చినా అతడు ఆనందించలేకపోయాడు. 

యోగి సర్కార్ సాయం : 

ఐఐటి ప్రవేశ పరీక్ష జెఈఈ లో మంచి మార్కులు సాధించాడు అతుల్. దీంతో అతడికి ధన్ బాద్ ఐఐటీలో సీటు వచ్చింది.  అయితే ఈ ఏడాది జూన్ 24 లోపు ఫీజు చెల్లించి జాయిన్ కావాల్సి వుండగా డబ్బులు లేకపోవడంతో అడ్మిషన్ ఆగిపోయింది. అతడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సాయం కోరినా ఎవరూ ముందుకురాలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

సుప్రీంకోర్టు జోక్యంతో అతుల్ పరిస్థితి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి చేరింది. దీంతో ఆ నిరుపేద విద్యార్థికి ప్రభుత్వం సహాయం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వెంటనే అధికారులను ఆదేశించి అతుల్‌కు అన్ని విధాలా సహాయం అందేలా చూడాలని సూచించారు.

సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి, విద్యార్థి చదువుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆర్థిక సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఐఐటి ధన్‌బాద్‌తోనూ యోగి ప్రభుత్వం సంప్రదించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలా పేద విద్యార్థి అతుల్ ప్రారంభ ఫీజును చెల్లించడమే కాకుండా, నాలుగు సంవత్సరాల పాటు అతని చదువుకు అయ్యే మొత్తం ఖర్చును కూడా స్కాలర్‌షిప్ ద్వారా భరిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో ఎలాంటి ఆటంకాలు ఎదుర్కోకుండా చూస్తామని ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios