రూ.5 కే కిలో గోధుమపిండి, రూ.6 కే కిలో బియ్యం, రూ.18 కే కిలోచక్కెర ... ఎక్కడో తెలుసా?

ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు వచ్చే భక్తులుకు ఆకలిబాధ లేకుండా ఏర్పాట్లు చేస్తోంది యోగి సర్కార్. ఇందుకోసం అతి తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందించేందుకు చర్యలు తీసుకుంది. 

 

Yogi Government Provides Affordable Food at Prayagraj Kumbh Mela 2025 AKP

మహాకుంభ నగర్ : ప్రయాగరాజ్ కుంభమేళాలోని అఖాడాలు, సంస్థలు, కల్పవాసులకు అతి తక్కువధరకే ఆహార ధాన్యాలను అందించేలా ఏర్పాట్లు చేసింది యోగి సర్కార్. ఇంత పెద్దఎత్తున నిర్వహించే కుంభమేళాలో ఎవ్వరూ ఆకలితో అలమటించకుడా అతి తక్కువ ధరకు ఆహార ధాన్యాలు అందించనున్నారు.  సీఎం యోగి ఆదేశాల మేరకు కుంభమేళాలో కేవలం 5 రూపాయలకే గోధుమపిండి, 6 రూపాయలకే బియ్యం అందించనున్నారు. దీనికోసం మేళా ప్రత్యేకంగా 138 రేషన్ షాపులను ఏర్పాటు చేశారు.

కిలో చక్కెర 18 రూపాయలే 

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈసారి కుంభమేళాను సరికొత్తగా  నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు అధికారులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా భక్తుల భోజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  మేళా ప్రాంతంలో 138 రేషన్ షాపులను ఏర్పాటు చేసి 1.2 లక్షల తెల్ల రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈసారి కల్పవాసులు, అఖాడాలు, సంస్థలకు చాలా తక్కువ ధరకు ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. కుంభమేళాలో అఖాడాలు, కల్పవాసులకు కిలో గోధుమపిండి రూ.5, కిలో బియ్యం రూ.6కి అందిస్తున్నారు. అంతేకాకుండా కిలో చక్కెర రూ.18కి అందిస్తున్నారు. అఖాడాలు, సంస్థలకు 800 పర్మిట్లు ఇస్తున్నారు.

ఆహార ధాన్యాలతో పాటు వంట చేసుకునేందుకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇందుకోసం 25 సెక్టార్లలో ఏజెన్సీలను నియమించారు. ఈ ఏజెన్సీలు కల్పవాసులు, అఖాడాలు, సంస్థలకు కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాయి. వాటికి రీఫిల్ చేసే ఏర్పాటు కూడా ఉంది. అంతేకాకుండా ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఉంటే వాటిని కూడా రీఫిల్ చేసుకోవచ్చు. మూడు రకాల సిలిండర్లను రీఫిల్ చేసే ఏర్పాటు ఉంది. 5 కిలోలు, 14.2 కిలోలు, 19 కిలోల సిలిండర్లను రీఫిల్ చేసుకోవచ్చు.

అన్నపూర్ణ కోసం ఐదు గోదాములు

కుంభమేళాలో అఖాడాలు, కల్పవాసులు, సంస్థలకు ఆహార సమస్య రాకుండా మేళా ప్రాంతంలో 138 షాపుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నపూర్ణ కోసం ఐదు గోదాములను ఏర్పాటు చేశారు. ఈ గోదాముల్లో 6000 మెట్రిక్ టన్నుల గోధుమపిండి, 4000 మెట్రిక్ టన్నుల బియ్యం, 2000 మెట్రిక్ టన్నుల చక్కెర నిల్వ ఉంచారు.

మేళా ప్రాంతంలో కల్పించిన ఈ ప్రత్యేక సౌకర్యం ద్వారా ప్రతి ఒక్కరికి 3 కిలోల గోధుమపిండి, 2 కిలోల బియ్యం, కిలో చక్కెర అందిస్తున్నారు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. వన్ నేషన్ వన్ కార్డు సౌకర్యం కూడా ఉంటుంది. ప్రతి షాపులో 100 క్వింటాళ్ల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచుతున్నారు.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios