దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫ్లాట్లను నిర్మించింది. పేదలకు అందించే ఆ ఫ్లాట్లను సీఎం యోగి శుక్రవారం ప్రారంభించారు. 

ప్రయాగ్ రాజ్ లో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్-పొలిటీషియన్ అతిక్ అహ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో పేదల కోసం యూపీ ప్రభుత్వం ఫ్లాట్లను నిర్మించింది. ఈ ఫ్లాట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం యోగి అక్కడి చిన్నారులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రారంభించిన ఫ్లాట్లలో 76 తాళాలను సీఎం చేతుల మీదుగా లబ్దిదారులు అందుకోనున్నారు.

అర్ధరాత్రి అన్యూహ పరిణామాలు..సెంథిల్ బాలాజీ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమిళనాడు గవర్నర్

ఉచితంగా ఫ్లాట్లు అందుకోవడం పట్ల లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ లబ్ధిదారుడు మాట్లాడుతూ ‘ఇండియా టీవీ’తో మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది. నాకు సొంత ఇల్లు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్లమని ఎవరూ చెప్పరు..’’ అని అన్నారు.

Scroll to load tweet…

కాగా.. అంతకు ముందు జూన్ 9వ తేదీన అతిక్ అహ్మద్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో నిర్మించిన మొత్తం డెబ్బై ఆరు ఫ్లాట్లను సీఎం యోగి ఆదిత్యనాథ్ లాటరీ పద్ధతిలో పేదలకు కేటాయించారు. ఈ సందర్భంగా పీడీఏ వైస్ చైర్మన్ అర్వింద్ చౌహాన్ మాట్లాడుతూ.. అతిక్ అహ్మద్ నివాసం ఉంటున్న నగరంలోని భూమిని స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని కూడా నడుపుతున్నామని తెలిపారు. ఈ స్థలంలో 76 ఫ్లాట్ల నిర్మాణాన్ని అథారిటీ పూర్తి చేసి లాటరీ ద్వారా ఈ యూనిట్లను కేటాయించిందని చెప్పారు.

చారిత్రాత్మకం.. తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు.. ఏ కేసులో అంటే ?

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఫ్లాట్లను కేటాయించినట్లు చౌహాన్ తెలిపారు. ప్రతీ ఫ్లాట్ లో అధునాతన సౌకర్యాలు ఉన్నాయని, బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, టాయిలెట్, బాత్రూం, బాల్కనీ, విద్యుత్, మురుగునీటి పారుదల, పార్కింగ్ సదుపాయం ఉందన్నారు.