Asianet News TeluguAsianet News Telugu

యడ్యూరప్ప మనవరాలి ఆత్మహత్య : ఒంటరి తనమే వేదనకు కారణమా?

కాన్పుకు ముందు వరకు ఆమె రామయ్య ఆస్పత్రిలో వైద్యురాలుగా సేవలు అందించారు తొమ్మిది నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నారు. కోవిడ్ పరిస్థితుల సమయంలో ఇంట్లో ఎక్కువ సమయం గడపడంతోనే ఆమె మానసిక ఒత్తిడికి గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఆమె బలవన్మరణానికి పాల్పడటం  యడ్యూరప్ప జీర్ణించుకోలేకపోయారు.  ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఊరడించారు.

Yediyurappas granddaughter dies by suicide, was battling postpartum depression, says Karnataka minister
Author
Hyderabad, First Published Jan 29, 2022, 12:06 PM IST

బెంగళూరు : ఆమె ఓ పెద్దింటి అమ్మాయి. సమాజాన్ని చక్కగా చదివే వైద్యురాలి వృత్తిలో నిమగ్నమైన యువతరం ప్రతినిధి ఆమె. ఒక్కసారిగా suicide చేసుకోవడం సంచలనం.. దిగ్భ్రాంతికి కారణమయ్యింది. మాజీ ముఖ్యమంత్రి Yeddyurappa మనుమరాలు docotor soundarya (30) హఠాత్తుగా బలవన్మరణానికి పాల్పడటం ఆమె కుటుంబ సభ్యులను కలచివేసింది. శుక్రవారం నాటి ఈ ఘటనకు కారణాలు విశ్లేషించే పనిలో అటు మీడియా- ఇటు పోలీసు వ్యవస్థ మునిగిపోయాయి. మూడేళ్ల కిందటే ఆమె డాక్టర్ నీరజ్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఒకరే సంతానం.

కాన్పుకు ముందు వరకు ఆమె రామయ్య ఆస్పత్రిలో doctorగా సేవలు అందించారు తొమ్మిది నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నారు. corona virus పరిస్థితుల సమయంలో ఇంట్లో ఎక్కువ సమయం గడపడంతోనే ఆమె Mental stressకి గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె బలవన్మరణానికి పాల్పడటం  యడియూరప్ప జీర్ణించుకోలేకపోయారు. ఆయనను ప్రధానమంత్రి Narendra Modi ఆయనకు ఫోన్ చేసి ఊరడించారు.

మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ధైర్యం చెప్పిన వారిలో ఉన్నారు. కుమార్తె పద్మావతి.. ఆమె గారాలపట్టి సౌందర్య అంటే యడియూరప్పకు చాలా ఇష్టం. మేనమాలు బి.వై. విజయేంద్ర, బి.వై.రాఘవేంద్రలకు ఇష్టమైన మేనకోడలు. ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప మనవరాలిని అని ఆమె ఎప్పుడూ, ఎవరితోనూ చెప్పుకునే వారు కాదు. అలా చెబితే...  అందరూ  తనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి.. దూరంగా ఉంచుతారు అని ఆమె అనుకునేవారు.  

covid సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండటమే ఆమెను బాధించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు కూడా ఏమీ లేవని సౌందర్య తల్లి పద్మావతి తెలిపారు. అందరితో కలివిడిగా మాట్లాడే ఆమె  బలవన్మరణానికి  పాల్పడడంతో ఆమె వేదనకు  లోనయ్యారు.

ఇలా ఇంకెందరో..
గతంలో ఐఏఎస్ అధికారి DK Ravi ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలోనూ దర్యాప్తు ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదు.  ఆర్థిక లావాదేవీలు, ఇతర పని ఒత్తిళ్ల తోనే  ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానం ఉంది. భారతీయ విజ్ఞాన సంస్థలో రెండేళ్లలో ఏడుగురు ఉన్నత విద్యావంతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. భవిష్యత్తు జీవితంపై  అవసరమైన ఆందోళనతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేటతెల్లమయింది. 

కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయిన లక్షలాది మందిలో ధైర్యాన్ని నింపేందుకు నిమ్హాన్స్ ప్రత్యేక సహాయవాణిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాతిక లక్షల మందికి కౌన్సిలింగ్ చేసి.. వారిలో ధైర్యాన్ని నింపింది. ఒంటరిగా ఉంటున్న వారిని గమనిస్తూ.. వారికి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు రోటరీ సంస్థ, మెడికో ప్యాస్టోరాల్ అసోసియేషన్, స్నేహ ఫౌండేషన్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్  సోషల్ సైన్సెస్ ప్రత్యేక సహాయవాణి నెంబర్లు నిర్వహిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా, శుక్రవారం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మనవరాలు బెంగళూరులోని వసంతనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని  అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 10 గంటల సమయంలో సౌందర్య ఇంట్లో పనిచేసే సహాయకురాలు తలుపు తట్టగా,  లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తో తలుపులు పగలగొట్టి చూడగా సౌందర్య తన  బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనాస్థిలిని పరిశీలించిన పోలీసులు.. ప్రాథమిక ఆధారాలు గుర్తించి.. ఇది ఆత్మహత్య కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

ఆమె మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా, సౌందర్య.. వైద్యురాలు. యడియూరప్ప మొదటి కుమార్తె అయన పద్మ కూతురు. ఆమెకు నాలుగు నెలల పాప ఉందనీ, గర్భధారణ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిందనే సోర్సెస్ పేర్కొంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios