Asianet News TeluguAsianet News Telugu

Year Ender 2023: ఈ ఏడాది సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్లయిన వారు వీరే..  

Year Ender 2023: ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సోషల్ మీడియా సహాయంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇలా కొందరు రాత్రికి రాత్రే స్టార్లు( Social media stars) అయ్యారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఏడాది ఫేమస్ అయిన వారి గురించి తెలుసుకుందాం..

YEAR ENDER 2023 Social media stars in 2023 These people become Star overnight through social media KRJ
Author
First Published Dec 15, 2023, 2:53 AM IST

Year Ender 2023: 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో విషయాలు జరిగాయి. అందులో కొన్ని మంచివి అయితే.. మరికొన్ని చెడు.  చెడు విడిచిపెట్టి మంచి విషయాలతో ముందుకు సాగుద్దామా... ఇదిలాఉంటే.. మన నిత్యం జీవితంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకరు నమ్మినా, నమ్మకపోయినా, సోషల్ మీడియాతో ఎదైనా చేయవచ్చు. రాత్రికి రాత్రే అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తిని పై స్థాయికి,  ఎక్కవ స్థాయి నుండి కిందికి తీసుకు రాగలదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సోషల్ మీడియా సహాయంతో చాలా మంది ఖ్యాతి గడించారు. కొందరు రాత్రికి రాత్రే స్టార్లు (Social media stars) అయ్యారు. సోషల్ మీడియా వల్ల ఈ ఏడాది ఫేమస్ అయిన వారి గురించి తెలుసుకుందాం..
 

1. సచిన్ - సీమా

సచిన్ - సీమా జంట అంటే.. సోషల్ మీడియాలో పరిచయం అవసరం లేని పేరు. పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్, భారత్‌కు చెందిన సచిన్ మీనాలు రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఎన్నో చర్చలు జరిగాయి.  పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్, భారత్‌కు చెందిన సచిన్ మీనా ప్రేమ వివాహం చేసుకున్నారు. సీమా 2023 మేలో తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి భారత్‌కు చేరుకుంది. వీరిద్దరూ ఢిల్లీ సమీపంలోని నోయిడాలో నివసిస్తున్నారు. వీరి ప్రేమకథ ఆన్లైన్ PUBG గేమ్ తో మొదలై పెళ్లి వరకు వచ్చింది. దీంతో వీరిద్దరూ అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు వార్తల్లో నిలిచారు.


2. మిథ్లేష్ భాటి
 
సీమా హైదర్- సచిన్ మీనా సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందారు. వారి పొరుగున ఉన్న మిథ్లేష్ భాటి కూడా సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందారు. సచిన్ మీనా, సీమా హైదర్ గురించి ఈ ఇద్దరి ఇరుగుపొరుగు వారితో మీడియా పర్సన్ మాట్లాడగా.. సచిన్ గురించి మిత్లేష్ భాటి మాట్లాడుతూ.. 'సచిన్ లప్పులాంటివాడు... సచిన్‌లో ఏముంది? అతను క్రికెట్ లాంటి అబ్బాయి.. ఆమె అతన్ని ప్రేమిస్తుందని తెలిపింది. మిత్లేష్ భాటి  క్లిప్ సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. ఆ వీడియోను బేస్ చేసుకుని వేలాది మీమ్స్‌ వచ్చాయి. ఇలా ఓ సాధారణ మహిళ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో పాపులర్ అయింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @lappu__sa__sachin

 

3. SDM జ్యోతి మౌర్య

ఉత్తరప్రదేశ్లో  సూర్యవంశం సినిమాను తలపించే సోర్టీ వెలుగులోకి వచ్చింది. సినిమాలో హీరో వెంకటేష్.. మీనాను కలెక్టర్ చదివించినట్టు.. ఉత్తరప్రదేశ్ లో ఓ రియల్ సోర్టీ వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ చెందిన అలోక్ నాథ్‌ అనే వ్యక్తి.. పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ.. తన భార్య జ్యోతి మౌర్యను చదివించాడు. చివరకు ఆమె  సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ చేశాడు. ఇలా ఎన్నో కష్టాలకు నొర్చి.. చదివిపిస్తే.. తన భార్య తన సీనియర్ అధికారితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ వివాదం సోషల్ మీడియాలో ప్రధానాంశంగా మారింది.

4. సింగర్ అమర్జీత్ జైకర్

ఎవరిలో ఏ టాలెంగ్ ఉందో  చెప్పడం చాలా కష్టం. ప్రతిభావంతులైన వ్యక్తులు, కష్టపడి పనిచేసిన వారి కోసం ఇది చెప్పబడింది. బీహార్‌కు చెందిన అమర్‌జీత్ జైకర్‌ ది కూడా ఇదే కథ.  అమర్‌జీత్ జైకార్ మంచి గాయకుడు. అతని గాత్రం చాలా మధురంగా ఉంటుంది. 2023లో అమర్జీత్ జైకర్ పాడిన పాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. బీహార్‌కు చెందిన అమర్జీత్ జయకర్ అనే వ్యక్తి పాటలు పాడే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అతని వీడియో అనతికాలంలోనే పాపులర్ అయ్యేవి. బాలీవుడ్‌లోని చాలా మంది అతనిని ప్రశంసించారు.సోనూ సూద్, హిమేష్ రేష్మియా కూడా అతనికి మద్దతు నిలిచారు.  

5. జాస్మిన్ కౌర్

సోషల్ మీడియా ద్వారా చాలా మంది తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అలా వ్యాపారం చేస్తున్న వారిలో జాస్మిన్ కౌర్ ఒకరు. ఆమె తన బట్టల వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునే క్రమంలో ఓ డైలాగ్ చాలా వైరల్ అయ్యింది.  ఈ డ్రెస్ ఎంత బాగుందో.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఎ వావ్‌ .. అనే డైలాగ్ ను సామాన్యుడి నుంచి బాలీవుడ్ తారల వరకు  ఆమ డైలాగ్‌లను కాపీ కొట్టడం ప్రారంభించారు. ఇలా జాస్మిన్ కౌర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారడమే కాకుండా ఆమె వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios