Asianet News TeluguAsianet News Telugu

రెండు దశాబ్ధాల అనుబంధానికి తెర .. భారత్‌లో వార్తా సేవలు నిలిపివేసిన ‘‘యాహూ’’

భారత్‌లో వార్తా సేవలను నిలిపివేస్తున్నట్లు యాహూ సంస్థ ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే యాహూ న్యూస్ లో ఎలాంటి తాజా కంటెంట్ ను పోస్టు చేయలేదు. అయితే యాహూ మెయిల్, సెర్చ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని సంస్థ వెల్లడించింది.

Yahoo news sites to shut down in India
Author
New Delhi, First Published Aug 26, 2021, 2:49 PM IST

యాహూ... ఇంటర్నెట్ ప్రపంచంలో ఓ సంచలనం. ఇది భారతదేశంలో రంగప్రవేశం చేసిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఆ తర్వాత గూగుల్ రాకతో యాహూ కొంచెం వెనుకబడినా ఇప్పటికీ సేవలు అందిస్తూనే వుంది. భారత్‌లో యాహూ సేవల్లో వార్తలు కూడా ముఖ్యమైన అంశం. గత రెండు దశాబ్దాలుగా యాహూ న్యూస్ పేరిట  ఈ సంస్థ వార్తలు అందిస్తోంది. అయితే, ఈ ఐటీ దిగ్గజం తాజాగా తన వార్తా సేవలు నిలిపివేసింది.

ఇవాళ్టి నుంచి యాహూ న్యూస్ కు స్వస్తి పలుకుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు తగ్గట్టుగానే యాహూ న్యూస్ లో ఎలాంటి తాజా కంటెంట్ ను పోస్టు చేయలేదు. అయితే యాహూ మెయిల్, సెర్చ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని సంస్థ వెల్లడించింది. తమ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగదని స్పష్టం చేసింది.

అయితే యాహూ తాజా నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలే కారణమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. డిజిటల్ మీడియా సంస్థల్లో విదేశీ సంస్థల పెట్టుబడులను 26 శాతం వరకే అనుమతిస్తుండడం యాహూ వెనుకంజకు కారణంగా తెలుస్తోంది. దానికితోడు విదేశీ మీడియా సంస్థలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం అధికం కానుంది

Follow Us:
Download App:
  • android
  • ios