Asianet News TeluguAsianet News Telugu

తప్పుడు ఇంజెక్షన్ తో మహిళ మృతి.. వైద్యార్హత లేకుండా క్లినిక్ నడుపుతున్న వ్యక్తి అరెస్ట్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోయిరౌనా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెమ్రాద్ ప్రాంతంలోని క్లినిక్‌లో తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో శుక్రవారం ఓ మహిళ మృతి చెందింది.

Wrong Injection By Quack Caused Woman Dies In UP - bsb
Author
First Published Feb 6, 2023, 7:20 AM IST

ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ జిల్లాలో వైద్యం సరిగా తెలియని వ్యక్తి ఇచ్చిన "తప్పుడు" ఇంజెక్షన్ వల్ల 48 ఏళ్ల మహిళ చనిపోయిందని పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోయిరౌనా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెమ్రాద్ ప్రాంతంలోని క్లినిక్‌లో ఈ ఘటన జరిగింది. తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో మహిళ శుక్రవారం మృతి చెందింది.

బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని ఉటంకిస్తూ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) బ్రిజేష్ కుమార్ మౌర్య మాట్లాడుతూ, పట్టి దేవి (48) అనే మహిళకు అనారోగ్యంగా ఉండడంతో రాజన్ విశ్వకర్మ అనే వ్యక్తి నడుపుతున్న క్లినిక్ కు తీసుకువెళ్లారు. అతను తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడంతో మరణించిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్పీ నేత SUV ఢీకొనడంతో ముగ్గురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..

ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు. "నిందితుడు పోలీసుల ముందు తన అర్హతకు సంబంధించి ఎటువంటి మెడికల్ డిగ్రీని సమర్పించలేకపోయారు" అని ఎస్ హెచ్ వో తెలిపారు.

ఇదిలా ఉండగా, భోపాల్‌లో ఓ మహిళా డాక్టర్ నాలుగు డోసుల మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాంధీ మెడికల్ కాలేజీ (జిఎంసి) హాస్టల్‌లో 24 ఏళ్ల మహిళా డాక్టర్ అనస్థీషియా మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసు అధికారి గురవారం తెలిపారు. జనవరి 4 సాయంత్రం ఆకాంక్ష మహేశ్వరి అనే మహిళ తన హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళ మృతదేహాన్ని అక్కడినుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 

ఆ తరువాత పోలీసులు ఆమె గది నుండి ఖాళీ ఇంజెక్షన్ బాటిల్స్, సిరంజిని స్వాధీనం చేసుకున్నారు, కోహ్-ఇ-ఫిజా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ సిసోడియా మాట్లాడుతూ, మహిళ  2.5 ఎం.ఎల్.  చొప్పున నాలుగు డోసుల అనస్థీషియాను తీసుకుందని తెలిపారు.ఆ గదిలో ‘తాను మానసికంగా దృఢంగా లేనని, టెన్షన్‌ని తట్టుకోలేకపోతున్నానని’ ఆమె రాసిన సూసైడ్ నోట్‌ లభించింది. వ్యక్తిగత కారణాలతోనే ఈ తీవ్రమైన నిర్ణయానికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని ఆయన అన్నారు. ఆ మహిళ తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పినట్లు కూడా ఆ నోట్‌లో పేర్కొంది.

ఆకాంక్ష మహేశ్వరి ప్రభుత్వ ఆధ్వర్యంలోని నడుస్తున్న జీఎంసీలో పీడియాట్రిక్స్  విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను చదువుతోంది. ఈ కోర్సు మొదటి సంవత్సరం విద్యార్థి అని ఆయన చెప్పారు.హాస్టల్ లోని ఇతర విద్యార్థుల కథనం మేరకు.. ఆ రోజు ఉదయం నుండి ఆమె గది తలుపులు మూసి ఉన్నాయి. సాయంత్రం తిరిగి వచ్చేసరికి కూడా అలాగే మూసి ఉండటంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. దాని గురించి సెక్యూరిటీ గార్డు, మెడికల్ మేనేజ్‌మెంట్ లను అప్రమత్తం చేసినట్లు అధికారి తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బలవంతంగా తలుపులు తెరిచి చూడగా గదిలో మహిళ శవమై పడి ఉందని తెలిపారు. ఆమె గ్వాలియర్ నివాసి. ఒక నెల క్రితం జీఎంసీలో చేరింది. ఆ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios