Asianet News TeluguAsianet News Telugu

అనురాగ్ ఠాకూర్‌ ఇంటికి రెజ్లర్లు: కేంద్రమంత్రితో చర్చలు

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు  ఇవాళ  సమావేశమయ్యారు.  డబ్ల్యూఎఫ్ఐ  అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ పై  మహిళ రెజ్లర్లు  లైంగిక  ఆరోపణలు  చేశారు. 

Wrestlers Bajrang Punia, Sakshi Malik meet Union Sports Minister Anurag Thakur lns
Author
First Published Jun 7, 2023, 12:20 PM IST

న్యూఢిల్లీ: రెజ్లర్లతో కేంద్ర ప్రభుత్వం  చర్చలు జరుపుతుంది.  కేంద్ర  స్పోర్ట్స్ మంత్రి అనురాగ్ ఠాకూర్  నివాసానికి  పలువురు రెజ్లర్లు  బుధవారంనాడు  చేరుకున్నారు.  నిరసన  చేస్తున్న రెజ్లర్లను చర్చలకు  ఆహ్వానించారు

 

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.  ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా  అనుగార్ ఠాకూర్ ప్రకటించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్  బ్రిజ్ భూషణ్  పై  మహిళ రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ విషయమై  ఆందోళనకు దిగారు.  బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని  కోరుతూ  రెజ్లర్లు   ఈ ఏడాది జనవరి నుండి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.    విపక్ష పార్టీలు  కూడా  రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు. రైతు సంఘాల  నాయకుడు రాకేష్ తికాయత్ కూడ  మహిళ రెజ్లర్లకు  మద్దతు  ప్రకటించారు.

  రెండు  రోజుల క్రితం  మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా తదితరులు విధుల్లో  చేరారు.  అయితే   ఉద్యమాన్ని నిలిపివేశారని  ప్రచారం సాగింది.  రైల్వేలో  తాము విధుల్లో  చేరినా కూడా  తమ ఆందోళనలను  కొనసాగిస్తామని  మహిళ  రెజర్లు  ప్రకటించారు. లైంగిక  వేధింపులకు  పాల్పడిన  బ్రిజ్ భూషన్ పై  చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్  చేస్తున్నారు.

ఈ నెల  3వ తేదీన  మహిళ  రెజ్లర్లతో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  చర్చించారు.  చట్టం ముందు  అందరూ  సమానులేనని  అమిత్ షా రెజ్లర్లతో వ్యాఖ్యానించారని సమాచారం.  అయితే  ఈ సమావేశంలో  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  రెజర్లు చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios