ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఇకపై తమ పోరాటాన్ని రోడ్డుపై కాకుండా కోర్టులో చేస్తామన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న భారత రెజ్లర్లు ఆదివారం తమ ఆందోళనను ముగించినట్లు ప్రకటించారు. ఇకపై తమ పోరాటం వీధిలో కాదు కోర్టులో జరుగుతుందని రెజ్లర్లు ప్రకటించారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.
అధికార బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చార్జిషీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందని వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ , బజరంగ్ పునియా ఒకేలాంటి ట్వీట్‌లను పోస్ట్ చేశారు. "మాకు న్యాయం జరిగే వరకు మల్లయోధుల నిరసన కొనసాగుతుంది. అయితే అది (పోరాటం) కోర్టులో ఉంటుంది.రహదారిపై కాదు" అని ట్విట్టర్‌లో ప్రకటించారు.
"WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)లో సంస్కరణకు సంబంధించి, వాగ్దానం చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 11 ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చేసిన వాగ్దానాల నెరవేర్పు కోసం మేము వేచి ఉంటాము" అని వారు తెలిపారు. అదే సమయంలో మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తాము సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
విశేషమేమిటంటే.. లైంగిక వేధింపులు గాను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై డిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అతనిపై మైనర్ చేసిన ఫిర్యాదును రద్దు చేయాలని కూడా సిఫార్సు చేశారు. పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత, ఫిర్యాదుదారుడి వాంగ్మూలాల ఆధారంగా కేసును రద్దు చేశామని ఢిల్లీ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్‌ఓ) సుమన్ నల్వా ఒక ప్రకటనలో తెలిపారు. బాధితురాలి తండ్రి , బాధితురాలు స్వయంగా. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 173 కింద పోలీసు రిపోర్టును దాఖలు చేసింది.
