Wrestlers: ఖేల్ రత్నా, అర్జునా అవార్డులను ఫుట్‌పాత్ పై వదిలేసిన రెజ్లర్ వినేశ్ ఫోగట్

ఖేల్ రత్నా, అర్జునా అవార్డులను ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఫుట్ పాత్ పై వదిలిపెట్టి వెళ్లిపోయారు. పీఎంవో ఆఫీసుకు వెళ్లుతుండగా ఓ పోలీసు అడ్డురావడంతో వాటిని పేవ్‌మెంట్ పైనే వదిలిపెట్టారు.
 

wrestler vinesh phogat left khel ratna, arjuna awards left at footpath kms

Vinesh Phogat: ఖేల్ రత్నా, అర్జునా అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన నాలుగు రోజులకు రెజ్లర్ వినేశ్ ఫోగట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, వాటిని ఫుట్ పాత్ పై వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. రెజ్లర్స్ బాడీపై రెజ్లర్లు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా వ్యవహరించిన బ్రిజ్ భూషణ్ శరణ్ పై రెజ్లర్లు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై కొందరు మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు. అయినా.. ఆయనపై చర్యలు తీసుకోకపోవడంతో వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా వంటి ఖిలాడీలు ఆందోళన ఉధృతం చేశారు. జంతర్ మంతర్ వద్ద కూడా వారు ధర్నా చేశారు. ఎట్టకేలకు డబ్ల్యూఎఫఐకి ఎన్నికలు నిర్వహించారు. అయితే.. ఈ ఖిలాడీలు సపోర్ట్ చేసిన అభ్యర్థిపై బ్రిజ్ భూషణ్ శరణ్‌కు సన్నిహితంగా ఉండే సంజయ్ సింగ్ గెలిచారు.

ఇది బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నాయకత్వానికి కొనసాగింపే అని రెజ్లర్లు మళ్లీ ఆందోళన బాటపట్టారు. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతానని సాక్షి మాలిక్ ప్రకటించారు. పద్మ శ్రీ అవార్డును బజరంగ్ పూనియా వెనక్కి ఇచ్చారు. తాజాగా వినేశ్ ఫోగల్ క్రీడాకరులకు అత్యంత గౌరవమైన అవార్డు ఖేల్ రత్నాతోపాటు అర్జునా అవార్డును ఫుట్ పాత్ పై వదిలిపెట్టారు.

Also Read: Revanth Reddy: కొత్త శకాన్ని నిర్మిద్దామని భట్టి, కోమటిరెడ్డి పిక్.. రేవంత్ కనిపించట్లేదు ఏంటబ్బా!?

తన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తానని వినేశ్ ఫోగట్ మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయానికి బహిరంగ లేఖ రాశారు. శనివారం ఆమె తన పతకాలను పట్టుకుని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు మధ్యగల కర్తవ్యపాత్‌పై నడుచుకుంటూ వెళ్లారు. పీఎంవోకు ఆమె వెళ్లుతుండగా ఓ పోలీసు ఆమెను అడ్డుకున్నారు. ఆ పోలీసుతో ఆమె మాట్లాడుతున్నట్టు ఓ వీడియోలో కనిపించింది. ఆ తర్వాత ఆమె తన పతకాలను ఫుట్ పాత్ పై వదిలిపెట్టి వెళ్లింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios