Independence Day: భారత్ కు ప్రపంచ నేతల శుభాకాంక్షలు..

Independence Day: భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్. రష్యా, నేపాల్ సహా పలు దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. 

World leaders greet India on country Independence Day KRJ

Independence Day: బ్రిటీష్ పాలకుల దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న భారత్ నేడు 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు జరుపుకుంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతీయులు జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేసి దేశ భక్తిని చాటుకుంటున్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్. రష్యా, నేపాల్ సహా పలు దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. 

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తాను, ప్రధాని మోదీతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి భారత్ 100 వ స్వాతంత్ర్య దినోత్సవం చేసుకుంటుంది. ఆనాటికి ఇండో-ఫ్రెంచ్ బంధం మరింత బలపడుతుందనీ, గత నెల నేను, నా స్నేహితుడు ప్రధాని మోడీ నిర్ణయించుకున్నామని తెలిపారు. భారతదేశం ఎల్లప్పుడూ ఫ్రాన్స్‌ను నమ్మకమైన స్నేహితుడు,భాగస్వామిగా పరిగణించవచ్చని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పేర్కొన్నారు. 

 

అదే సమయంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అధ్యక్షుడు ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. ఆర్థిక, వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక తదితర రంగాల్లో భారత్ విజయం సాధించిందని చెప్పారు. అంతర్జాతీయ వ్యవహారాలలో భారత్ కీలక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 


దీంతో పాటు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత దేశ పౌరులకు  శుభాకాంక్షలు తెలిపారు.  

అదే సమయంలో.. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల స్నేహం, సహకారం మరింత దృఢంగా, సుభిక్షంగా సాగాలని ఆశించారు.

 
భారతదేశంలోని ఆస్ట్రేలియన్ హైకమిషన్ భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. పీఎం ఆంథోనీ అల్బనీస్ కూడా శుభాకాంక్షలు తెలిపారని ఆయన అన్నారు.  ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాను మార్చిలో భారతదేశానికి వెళ్లానని, ఆ సమయంలో ఆస్ట్రేలియా - భారతదేశం మధ్య బలమైన సంబంధం ఉందని తాను గ్రహించాననీ,  రాబోయే కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలనేది తన  లక్ష్యమని  ఆయన అన్నారు.

 

భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశపు అతి పెద్ద ప్రజాస్వామ్యంలో సంబరాలు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు. భారతదేశ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందనీ, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

టర్కిస్థాన్ ప్రభుత్వం భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇరు దేశాలకు మంచి భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. తద్వారా ఇరుదేశాల మధ్య స్నేహం, సహకారం, సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆశించింది

మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ .. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, పిఎం మోడీ, భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. "భారతదేశం ఎల్లప్పుడూ శాశ్వత స్వేచ్ఛ,శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి" అని పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios