Asianet News TeluguAsianet News Telugu

కరోనా వేళ వినాయక చవితి... గవ్వలతో గణేశుడు..!

కరోనా ని దృష్టిలో పెట్టుకొని దర్శన సమయంలో రద్దీని నివారించడానికి బహరింగ మండపాల వద్ద భక్తుల రాకపై నిషేధం విధించారు. ఉరేగింపులకు సైతం తక్కువ మంది భక్తులను అనుమతి ఇస్తున్నారు.

World first 'Oyster Ganesha' sitting on the beach of Puri to give a message of peace
Author
hyderabad, First Published Sep 10, 2021, 1:54 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గతేడాది ఈ కరోనా కారణంగా.. కనీసం వినాయక చవితి సంబరాలు జరుపుకోవడానికి  వీలు లేకుండా పోయింది. కానీ.. ఈ సంవత్సరం ఆంక్షల మధ్య గణేష్ ఉత్సవాలు జరుపుతున్నారు. కొన్ని రకాల ఆంక్షలతో అన్ని రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహిస్తున్నారు.

అన్ని రాష్ట్రాల్లో కెల్లా మహారాష్ట్రలో ఈ ఉత్సావాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే.. కరోనా ని దృష్టిలో పెట్టుకొని దర్శన సమయంలో రద్దీని నివారించడానికి బహరింగ మండపాల వద్ద భక్తుల రాకపై నిషేధం విధించారు. ఉరేగింపులకు సైతం తక్కువ మంది భక్తులను అనుమతి ఇస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. తొలిసారి వినాయకుడిని గవ్వలతో ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ ఫోటో విశేషంగా ఆకట్టుకుంటోంది.  ఒడిశాలోని పూరీ బీచ్ లో ప్రసిద్ధ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.. ప్రత్యేకంగా ఇసుకలో ఆర్ట్స్ వేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఇసుకలో.. వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకంగా.. ఇసుకలో వినాయకుడిని గవ్వలతో అలంకరించడం విశేషం. ఈ చిత్రం ఇప్పుడు నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.

కాగా.. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో.. పలు చోట్ల 144 సెక్షన్ విధించారు.  మహారాష్ట్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, పండల్ నుండి ఆన్‌లైన్ దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహాన్ని మహారాష్ట్రకు తీసుకువచ్చి నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నప్పుడు కేవలం 10 మంది మాత్రమే హాజరు కాగలరు. ఇంట్లో విగ్రహాన్ని తీసుకువచ్చి నిమజ్జనం చేసేటప్పుడు ఈ సంఖ్య 5 మాత్రమే ఉంటుంది.

కాగా.. కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉన్న నేపథ్యంలో.. గణేష్ ఉత్సవాల్లో పాల్గొనేవారు వ్యాక్సిన్ కచ్చితంగా వేయించుకోవాలని సూచిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios