వరల్డ్ అథ్లెట్ చీఫ్ సెబాస్టియన్ మనోడే ... ఎలాగో తెలుసా?
వరల్డ్ అథ్లెటిక్ చీఫ్ సెబాస్టియన్ కోతో ఆసియానెట్ న్యూస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా ప్రత్యేక ఇంటర్వ్యూ.
world athletics head sebastian coe exclusive interview : ప్రస్తుతం భారత పర్యటనలో వున్న వరల్డ్ అథ్లెటిక్స్ చీఫ్ సెబాస్టియన్ కో ఏషియానెట్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా భారత్‌తో తనకున్న సంబంధం గురించి మాట్లాడారు. తన జీవితంలో భారతదేశ ప్రభావం చాలా ఉందని ఆయన తెలిపారు. ఇలా ఏషియానెట్ న్యూస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా నిర్వహించిన ఇంటర్వ్యూలో సెబాస్టియన్ కో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తన తాతముత్తాలది ఇండియానే అని సెబాస్టియన్ కో బైటపెట్టారు. తన తాత సదారి లార్క్ మలుత్రా పంజాబ్‌కు చెందినవాడని... ఆయన ఢిల్లీలో ప్రముఖ హోటల్‌ని కలిగి వుండేవారని తెలిపారు. కన్నాట్ స్క్వేర్‌లోని ఆ మెరీనా హోటల్ ఇప్పటికీ ఉందని సెబాస్టియన్ కో చెప్పారు.
మలుత్రా లాయర్‌గా కెరీర్ ప్రారంభించి లండన్ కు షిప్ట్ అయ్యారని... అక్కడే ప్రాక్టీస్ చేసారని తెలిపారు. అక్కడే అమ్మమ్మను కలిసారని ... వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అమ్మమ్మ సగం ఐరిష్, సగం వెల్ష్. పెళ్లి తర్వాత తాత, అమ్మమ్మ ఇండియాకు వచ్చారని... కానీ వారు ఎక్కువరోజులు కలిసి వుండలేకపోయారని తెలిపారు.
తన తల్లికి 10-11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే అమ్మమ్మ లండన్ కు తిరిగి వెళ్ళిపోయిందని సెబాస్టియన్ అన్నారు. ఇలా తన కుటుంబం ఇండియాకు దూరం అయ్యిందని వివరించారు.
భారత్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ... తన మామ భారత్ కోసం పనిచేశారని సెబాస్టియన్ కో వెల్లడించారు. ఐరాసలో చాలా ఏళ్ల పాటు భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. తన బంధువులలో ఒకరు భారత ప్రభుత్వానికి పనిచేశారని, అందువల్ల భారతీయ ప్రభావం తన జీవితంలో చాలా బలంగా ఉందని కూడా అతను పేర్కొన్నాడు. అమ్మ క్రమం తప్పకుండా ఇండియా వచ్చేది...ప్రతి సంవత్సరం కొన్ని నెలలు భారతదేశంలో గడిపేదని తెలిపారు. అందువల్లే భారత్ తో అనుబంధం జీవితంలో ఒక భాగం అయ్యిందని సెబాస్టియన్ అన్నారు.
ఇదిలా ఉంటే 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం తహతహలాడుతున్న వేళ సెబాస్టియన్ కో ఢిల్లీకి చేరుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవ్యతో ఆయన సమావేశమయ్యారు. నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత, అతను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అధ్యక్షుడిగా పోటీలో ఉన్నాడు. ఈ స్థితిలో సెబాస్టియన్ కో రాకను క్రీడా ప్రపంచం ఎంతో ప్రాధాన్యతతో చూస్తోంది.
పూర్తి ఇంటర్వ్యూ