Army Chief Naravane: సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్నైనా భారత సైన్యం సఫలం కానివ్వబోదని తేల్చి చెప్పారు ఆర్మీ చీఫ్​ ఎంఎం నరవణె. సైనిక దినోత్సవంలో పాల్గొన్న ఆయన ప‌రోక్షంగా చైనా, భార‌త్ ల సరిహద్దు వివాదాన్ని ప్ర‌స్తావించారు. 

Army Chief Naravane: దేశ సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్ని సఫలం కానివ్వబోమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తెలిపారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఆర్మీడే పరేడ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే.. ఊరుకోబోమ‌ని పాక్, చైనాల‌కు నరవణె గ‌ట్టిగా హెచ్చరించారు. 

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. చైనా సరిహద్దు వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందని తెలిపారు. ముఖ్యంగా తూర్పు లడఖ్ ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ఈ ప్రతిష్టంభనను తొలిగించి.. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారత్, చైనాల మధ్య 14వ రౌండ్ సైనిక అధికారుల స్థాయి చర్చలు జరిగాయని జనరల్ నరవానే చెప్పారు. ఉమ్మడి,సమాన భద్రత ప్రాతిపదికన స‌మ‌స్య‌ పరిష్కారాన్ని ప్రయత్నాలు కొనసాగుతాయని జనరల్ నరవాణే చెప్పారు

"మన సహనం మన ఆత్మవిశ్వాసానికి సంకేతం వంటిది, పొర‌పాటున కూడా దానిని ప‌రీక్షించ‌డానికి ఏ ఒక్క‌రూ ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌ని జనరల్ నరవాణే పేర్కొన్నారు. దేశ సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తించ‌బోమ‌ని గట్టిగా చెప్పారు. గతేడాది ఎన్నో సార్లు సరిహద్దుల వద్ద ఉల్లంఘనలు జ‌రిగాయ‌ని, ఎన్నో సార్లు స‌రిహ‌ద్దు దేశాల మ‌ధ్య చర్యలు జ‌రిగాయని నరవణె పేర్కొన్నారు.

నియంత్రణ రేఖపై పరిస్థితి గత ఏడాది కంటే మెరుగ్గా ఉందని, అయితే పాకిస్థాన్ ఇప్పటికీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని జనరల్ నరవానే అన్నారు. పాకిస్తాన్ మాత్రం భారత్ లోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. దాదాపు 300-400 మంది ఉగ్రవాదులు భారత్ లోకి అక్ర‌మంగా చొరబడ్డార‌ని.. వీరిలో 194 మంది ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ ఆపరేషన్స్ లో హతమయ్యారని తెలిపారు. అలాగే సరిహద్దులో డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయ‌ని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి 1949 జనవరి 15న ఇండియన్ ఆర్మీ చీఫ్ బాధ్యతలను ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప స్వీకరించిన సందర్భానికి గుర్తుగా ఆర్మీ డే ను జరుపుకుంటారు.

చైనాతో నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి గతేడాది కంటే మెరుగ్గానే ఉన్నట్టు నరవణె తెలిపారు. మే 5, 2020న జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత, భారీ ఆయుధాలతో పాటు వాస్తవ నియంత్రణ రేఖ (LAC)కు ఇరువైపుల 50,000 నుండి 60,000 మంది సైనికులు మోహ‌రించిన‌ట్టు తెలుస్తోంది.