సోషల్ మీడియా ఇప్పుడు నిత్యజీవితంలో భాగంగా మారిపోయింది. మహారాష్ట్రలో ఓ బాలిక పెట్టిన స్టేటస్ రెండు కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారి తీసింది. ఈ దాడిలో స్టేటస్ పెట్టిన బాలిక తల్లి తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తర్వాతి రోజు ప్రాణాలు కోల్పోయారు. 

ముంబయి: ఓ వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) రెండు కుటుంబాల మధ్య మంటలు పెట్టింది. ఓ బాలిక పెట్టిన ఓ స్టేటస్ తనను ఉద్దేశించే పెట్టిందని మరో బాలిక పొరబడింది. ఆ తప్పుడు అభిప్రాయం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఏకంగా ఒక కుటుంబం మరో కుటుంబం ఇంటి మీదకు దాడి(Attack)కి వెళ్లింది. ఎదురుగా కనిపించిన వారిని చితకబాదారు. ఈ ఘర్షణలో స్టేటస్ పెట్టిన బాలిక తల్లి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. కానీ, చికిత్స పొందుతూనే తర్వాతి రోజు కన్నుమూసింది. ఈ ఘటన మహారాష్ట్ర(Maharashtra)లో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని పాల్‌గడ్‌లో ఈ ఘటన జరిగింది. శివాజీ నగర్‌లో లీలావతి దేవి ప్రసాద్ కుటుంబం నివాసం ఉంటున్నది. లీలావతి దేవీ ప్రసాద్ దంపతులకు ఒక కూతురు ఉన్నది. ఆమె తన వాట్సాప్ స్టేటస్‌లో ఓ పోస్టు పెట్టింది. ఈ స్టేటస్ ఆమె ఫ్రెండ్‌ మరో అమ్మాయికి అభ్యంతరంగా కనిపించింది. అసలు ఆ స్టేటస్ తనను ఉద్దేశించే లీలావతి దేవీ ప్రసాద్ కూతురు పెట్టిందని ఆలోచించింది. తీవ్రంగా మనోవేధనకు గురైంది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో లీలావతి దేవీ ప్రసాద్ కూతురి ఫ్రెండ్ కుటుంబం ఆగ్రహానికి లోనైంది.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 10వ తేదీన శివాజీనగర్‌లోని లీలావతి దేవీ ప్రసాద్ కుటుంబం మీదకు ఆ యువతి, ఆమె సోదరులు, తల్లి దాడికి వెళ్లారు. లీలావతి దేవీ ప్రసాద్ సహా ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ ఘర్షణల్లో లీలావతి దేవీ ప్రసాద్ ఎక్కువ గాయపడింది. ఆమెను సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆమె ఎక్కువగా గాయపడింది. వైద్యులు వెంటనే చికిత్స మొదలు పెట్టారు. కానీ, వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆమె హాస్పిటల్‌లో చేరిన తర్వాతి రోజే చికిత్స పొందుతూ మరణించారు.

తన వాట్సాప్ స్టేటస్ చాలా జనరల్‌ది అని, ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని లీలావతి దేవీ ప్రసాద్ కూతురు విలేకరులకు తెలిపింది.

ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో దాడి చేసిన బాలిక తల్లి, మరో ఇద్దరు ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే, వివాదానికి కారణమైన వాట్సాప్ స్టేటస్‌లో ఏమి పెట్టారో ఇప్పటికీ తెలుపలేదని బోయిసర్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సురేశ్ కాదమ్ వివరించారు.

ఇదిలా ఉండగా, పొగత్రాగడం (smoking) ప్రాణాలకు హానికరమని ఎవరెంత మొత్తుకున్నా తాగేవారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటు అనేక రకాల శ్వాస సంబంధిత వ్యాదులకు పొగ తాగడమే ప్రధాన కారణం. ఈ విషయం ప్రతిఒక్కరికీ తెలుసు... అయినా పొగతాగుతాగడం మానేయరు. ఇలా ధూమపానం కారణంగా మంచానపడినా పొగతాగడం మాత్రం మానేయకలేకపోయాడు ఓ వ్యక్తి. చివరకు అదే సిగరెట్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిల మధుకర్(60) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడు మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబసభ్యులు పనులపై బయటకు వెళ్ళగా ఇంట్లో ఒక్కడే వుండేవాడు.

ఇలా రోజూ మాదిరిగానే గత శుక్రవారం కుటుంబసభ్యులంతా పనులపై బయటకు వెళ్లారు. ఈ సమయంలో మధుకర్ మంచంపై పడుకునే సిగరెట్ తాగడానికి ప్రయత్నించాడు. కానీ సిగరెట్ నిప్పురవ్వలు మంచంపై వున్న బట్టలపై పడి రాజుకున్నాయి. ఈ విషయాన్ని మధుకర్ గమనించలేదు. దీంతో మంటలు చెలరేగి మంచానికి అంటుకున్నాయి. నడవలేని స్థితిలో వున్న మధుకర్ ఈ సిగరెట్ ద్వారా చెలరేగిన మంటల్లో చిక్కుకున్నాడు.