Asianet News TeluguAsianet News Telugu

విత్తనాల కోసం పోటెత్తిన అన్నదాతలు.. మహిళా రైతుపై ఎస్ఐ వీరంగం

ఒక మహిళా ఎస్‌ఐ ఓవరాక్షన్ చేసింది. విత్తనాల కోసం వచ్చిన మహిళా రైతుతో దురుసుగా ప్రవర్తించింది. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గురుమఠకల్‌లో అధికారులు శుక్రవారం విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు

women si throws women farmer on the ground in karnataka
Author
Yadgir, First Published Oct 1, 2021, 5:06 PM IST

ఒక మహిళా ఎస్‌ఐ ఓవరాక్షన్ చేసింది. విత్తనాల కోసం వచ్చిన మహిళా రైతుతో దురుసుగా ప్రవర్తించింది. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గురుమఠకల్‌లో అధికారులు శుక్రవారం విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అనేకమంది ఇక్కడకు చేరుకున్నారు.

వీరంతా విత్తనాల కోసం వచ్చిన రైతులే. అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళా రైతులు కూడా వరుసలో నిలబడ్డారు. అయితే విత్తనాల కోసం కొంత తోపులాట కూడా జరిగింది. దీంతో ఇక్కడ బందోబస్తు డ్యూటీలో ఉన్న గంగమ్మ అనే మహిళా ఎస్‌ఐ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ.. ఒక మహిళను కిందకు తోసేసి చేయిచేసుకుంది.

దీంతో గంగమ్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా రైతులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు నిరసనకారులపై లాఠీ చార్జికి దిగారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని జిల్లా కలెక్టర్, ఎస్పీ  హామీ ఇచ్చారు
 

Follow Us:
Download App:
  • android
  • ios