కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి.. ఉద్యోగినిపై సహోద్యోగులు ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... మహిళ ఢిల్లీలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శనివారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఆమెకు సహోద్యోగులు కారులో లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకున్నారు. కాగా.. కారులో తనకు పానీయాన్ని ఇచ్చారని, దానిని తాగి తాను స్పృహ కోల్పోయానని ఆమె తెలిపింది. పానీయంలో మత్తు మందు కలిపారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 

వారిద్దరు తనపై వంతులవారీగా అత్యాచారం జరిపి, వసంత్‌కుంజ్‌లో ఓ చోట తనను వదిలి వెళ్లారని ఆమె తెలిపింది. తాను ఎలాగోలా ద్వారకాలో ఉన్న ఇంటికి చేరి పోలీసు కంట్రోల్‌ రూముకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినట్లు మహిళ తెలిపింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేçసు నమోదు చేసి వైద్య పరీక్ష అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు