తమ భార్యలను కలుసుకొనేందుకు ఆ భర్తలకు రెండేళ్లు పట్టింది. పెళ్లి చేసుకొన్న తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలతో భార్యలకు దూరంగా ఉన్నారు భర్తలు.

న్యూఢిల్లీ: తమ భార్యలను కలుసుకొనేందుకు ఆ భర్తలకు రెండేళ్లు పట్టింది. పెళ్లి చేసుకొన్న తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలతో భార్యలకు దూరంగా ఉన్నారు భర్తలు.రాజస్థాన్ లోని బాడ్మేర్, జైసల్మేరు కు చెందిన ముగ్గురు యువకులు 2019లో పాకిస్తాన్ కు చెందిన సింధ్ రాష్ట్రంలోని ముగ్గురు యువతులను పెళ్లాడారు.

నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ నుండి భారత్ కు వచ్చేందుకు ఆ ముగ్గురు యువలకు భార్యలకు ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసాలు ఇవ్వలేదు.

దీంతో భార్యలను వారి పుట్టింట్లోనే వదిలేసి ముగ్గురు యువకులు ఇండియాకు తిరిగి వచ్చారు. పాకిస్తాన్ లో ఉన్న తమ భార్యలను ఇండియాకు రప్పించేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి వారి ప్రయత్నాలు ఫలించాయి.

ఈ ముగ్గురికి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత విదేశీ వ్యవహరాల శాఖ చొరవ తీసుకొని ఈ ముగ్గురు యువతులను పాకిస్తాన్ నుండి ఇండియాకు రప్పించింది. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ముగ్గురు పాకిస్తాన్ నుండి ఇండియాకు చేరుకొన్నారు.