Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ నిరసనల్లో పోలీసులపై ఉమ్మేసిన కాంగ్రెస్ మహిళా నేత (వీడియో)

రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఓ ఆందోళనలో కాంగ్రెస్ మహిళా విభాగం యాక్టింగ్ ప్రెసిడెంట్ నెట్టా డిసౌజా పోలీసులపై ఉమ్మేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.
 

women congress acting president netta dsouza spits on cops during protest
Author
New Delhi, First Published Jun 21, 2022, 8:07 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఓ ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఓ మహిళా నేత ఉమ్మేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎక్కింది.

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు అందుకుని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపడుతున్నది. ఈ పిలుపులో భాగంగానే ఢిల్లీలోని ఉధృతంగా నిరసనలు జరిగాయి. ఇలాంటి ఓ ఆందోళనలోనే కాంగ్రెస్ మహిళా విభాగం యాక్టింగ్ అధ్యక్షురాలు నెట్టా డి సౌజాను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆమెను పోలీసు బస్సులోకి ఎక్కించారు. ఆమెను పోలీసు బస్సులోకి ఎక్కిస్తుండగా డోర్ దగ్గరే నిలుచుని పోలీసులపై ఉమ్మేశారు. ఈ ఘటన వీడియోలో రికార్డ్ అయింది.

దీనిపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాల మండిపడ్డారు. ఇది సిగ్గు చేటు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అసోలో పోలీసులపై దాడి చేశారని, హైదరాబాద్‌లో పోలీసుల కాలర్ పట్టుకున్నారని, ఇప్పుడు ఏకంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పోలీసులపై ఉమ్మేశారు అని అన్నారు. ఇదంతా కేవలం రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడం వల్లే అని పేర్కొన్నారు. నెట్టా డిసౌజా పై సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios