మధ్యప్రదేశ్‌లో ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట మహిళలు బాడీ బిల్డింగ్ చేయడం పెను దుమారం రేపింది. భగవంతుడి ముందు ఆడవాళ్లు బికినీలతో వుండటం ఏంటని భగ్గుమంటున్నాయి విపక్షాలు.
మధ్యప్రదేశ్‌లో ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట మహిళలు బాడీ బిల్డింగ్ చేయడం పెను దుమారం రేపింది. ఇటీవల రత్లామ్‌లో జూనియర్ మిస్టర్ ఇండియా 2023 పోటీలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దేశంలోని మహిళా బిల్డర్లు అర్ధనగ్నంగా, చెప్పులు ధరించి తమ శరీరాన్ని సౌష్టవాన్ని ప్రదర్శించారు. అయితే పోటీలు జరుగుతున్న వేదిక మీద హనుమాన్ విగ్రహం కూడా వుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.
భగవంతుడి ముందు ఆడవాళ్లు బికినీలతో వుండటం ఏంటని భగ్గుమంటున్నాయి. అయితే దీనిపై బీజేపీ నేతలు సైతం ధీటుగానే బదులిస్తున్నారు. మహిళలు కుస్తీలు ఆడటాన్ని కాంగ్రెస్ నేతలు చూడలేరంటూ కౌంటరిస్తున్నారు. జిమ్నాస్టిక్స్, ఈతలు కొడుతున్న మహిళలను వారు చూడలేరని .. ఆ సమయంలో వాళ్లలోని దెయ్యం మేల్కొంటుందన్నారు. మైదానంలోని మహిళలను పాడు కళ్లతోనే చూస్తారని, వాళ్లకు సిగ్గుండాలంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
