ముంగేర్ కు చెందిన బాధిత మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి పుట్టింటికి చేరింది. ఆ సమయంలో వరుసకు తమ్ముడ్యే వ్యక్తితో ఆమెకు స్నేహం కుదిరింది. ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని ఇద్దరూ అనుకున్నారు. దీంతో అతడితో ఆమె శారీరక సంబంధం పెట్టుకుంది. ఫలితంగా గర్భం దాల్చింది. ఆ విషయం తెలియడంతో అతడు ఆమెకు మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు.
బీహార్ : ఆమె భర్తకు విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటోంది. ఆ సమయంలో పిన్ని కొడుకు ఆమెకు సన్నిహితంగా మారాడు. ఇద్దరూ తరచుగా మాట్లాడుకునేవారు. అతడు ఆమెకు వరుసకు brother కావడంతో ఎవరూ అనుమానించలేదు. వారిద్దరి మధ్య స్నేహం loveగా మారింది. ఆ స్నేహం శారీరక సంబంధానికి దారి తీసింది. ఫలితంగా ఆ యువతి pregnant అయ్యింది. విషయం బయటపడడంతో ఆ యువకుడు ఆమెకు మొహం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బీహార్ లోని ముంగేర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ముంగేర్ కు చెందిన బాధిత మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి పుట్టింటికి చేరింది. ఆ సమయంలో వరుసకు తమ్ముడ్యే వ్యక్తితో ఆమెకు స్నేహం కుదిరింది. ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని ఇద్దరూ అనుకున్నారు. దీంతో అతడితో ఆమె శారీరక సంబంధం పెట్టుకుంది. ఫలితంగా గర్భం దాల్చింది. ఆ విషయం తెలియడంతో అతడు ఆమెకు మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దీంతో ఆ మహిళ తన గర్బం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అది విని వారు షాక్ అయ్యారు. వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో ఎలా ఇంత పని చేశావ్? ఇప్పుడు పెళ్లి ఎలా? అని నిలదీశారు.
చివరికి నిందితుడి ఇంటికి వెళ్లి పెళ్లి గురించి అడిగారు. అతడి కుటుంబం పెళ్లికి నిరాకరించడంతో బాధిత మహిళ బుధవారం ముంగేర్ మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు గురించి విని మొదట పోలీసులు కూడా షాకయ్యారు. సోదరుడిని పెళ్లి చేసుకుంటానని మహిళ చెబుతుండడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడి కుటుంబంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, తనతో సహజీవనం చేసిన మహిళను ఓ వ్యక్తి సజీవ దహనం చేశాడు. కూకట్పల్లి సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం వెంకటలక్ష్మి (50) నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రి లో Contract sweeper గా పనిచేస్తుంది. Disability pensioner కూడా. పదేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహం చేసింది. జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉండే వెంకటేష్ (55)తో పరిచయం ఏర్పడింది.
పంజాబ్ లూథియానా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
వెంకటేష్ భార్య చనిపోగా కుమారుడితో ఉంటున్నాడు. అతనికి స్థానికంగా వెల్డింగ్ దుకాణం ఉంది. ఇద్దరూ పదేళ్ల పాటు కలిసి సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వెంకట లక్ష్మి తన కుమారుడితో కలిసి కూకట్పల్లి ప్రశాంత్ నగర్ కు మకాం మార్చింది. తనతోనే ఉండాలని వెంకటేష్ పలుమార్లు ఒత్తిడి తెచ్చి వేధించాడు. ఆమె ససేమిరా అనడంతో పగ పెంచుకున్నాడు.
బుధవారం సాయంత్రం ఆమె కుమారుడు విధులకు వెళ్ళాడు. రాత్రి 8 గంటల సమయంలో వెంకటేష్ ఆమె వద్దకు వెళ్ళాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో నుంచి మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించి స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా కాలిన గాయాలతో వెంకటలక్ష్మి చనిపోయి ఉంది.
వెంకటేష్ సైతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతుండడంతో అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గొడవ జరగడంతో ఆవేశంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ క్రమంలో అతనికీ మంటలు అంటుకుని ఉంటాయి అని అనుమానిస్తున్నారు. ఎస్సై పి. సురేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
