Asianet News TeluguAsianet News Telugu

ఎంఏ ఇంగ్లీష్ చదివి... చాయ్ వాలాగా మారిన యువతి..నెట్టింట వైరల్..!

ఘోష్ బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీలో పనిచేసేవారు. కానీ.. ఆ ఉద్యోగం ఆమెకు తృప్తి ఇవ్వలేదు. అందుకే మంచి జీతం వస్తున్నా... దానిని వదిలేసింది.

Woman with MA in English sells tea at Delhi Cantonment area ray
Author
First Published Jan 17, 2023, 9:44 AM IST

ఆమె ఎంఏ ఇంగ్లీష్ చదవింది. చదువు పూర్తవ్వగానే మంచి ఉద్యోగం కూడా వచ్చింది.  మంచి జీతం కూడా వస్తోంది. కానీ... ఆమె మనసుకు మాత్రం తృప్తి లభించలేదు. నచ్చిన పని చేయాలని.. తన కల నిజం చేసుకోవాలని అనుకుంది. అంతే... క్షణం ఆలోచించకుండా ఉద్యోగం మానేసింది. తర్వాత... ఓ టీ స్టాల్ పెట్టుకుంది. ఎంఏ ఇంగ్లీష్ చదవిన అమ్మాయి... ఇలా టీ స్టాల్ పెట్టుకోవడం ఏంటి అని మొదట అందరూ షాకయ్యారు. కానీ... ఆమె లక్ష్యం, ఆమె ఏం సాధించాలని అనుకుంటున్న విషయం తెలిసి.. అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఆర్మీ వెటరన్ బ్రిగేడియర్ సంజయ్ ఖన్నా లింక్డ్‌ఇన్‌లో ఈ ఎంఏ ఇంగ్లీష్ చాయ్ వాలా గురించి పోస్టు చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. ఆ పోస్టు ప్రకారం... ఆ యువతి పేరు  శర్మిష్ట ఘోష్ ఏంఏ ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఘోష్ బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీలో పనిచేసేవారు. కానీ.. ఆ ఉద్యోగం ఆమెకు తృప్తి ఇవ్వలేదు. అందుకే మంచి జీతం వస్తున్నా... దానిని వదిలేసింది. చాయోస్ అనే ప్రసిద్ధ పానియాల బ్రాండ్ ని అధిగమించాలనేది తన టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే.. ఢిల్లీలో తన టీ స్టాల్ ఓపెన్ చేసింది. టీతో పాటు... చాట్ కూడా అందిస్తోంది.

శర్మిష్టా ఘోష్ తో పాటు... ఆమె స్నేహితురాలు భావన రావు కూడా.... ఈ చాయ్ స్టాల్ నిర్వహణలో పార్ట్ నర్ కావడం విశేషం. ఆమె కూడా ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం ఉన్నా... ఈ టీ స్టాల్ నిర్వహణలో పార్ట్ నర్ కావడం విశేషం. ఈ చిన్న స్టాల్ ని ఎప్పటికైనా పెద్ద బ్రాండ్ గా మార్చడమే తమ లక్ష్యం అని వారు చెప్పడం విశేషం. ప్రస్తుతం నెట్టింట సంజయ్ ఖన్నా షేర్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. అయితే... శర్మిష్టా చేస్తున్న పనిని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. కొందరు విమర్శిస్తున్నారు. లక్ష్యం కోసం కష్టపడుతున్నందుకు శెభాష్ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా... అంత చదువు చదివి... ఈ పని చేయడం కరెక్ట్ కాదని.. మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios